Just SportsLatest News

Chennai Super Kings : చెపాక్ లో చెన్నై చెడుగుడు..చిత్తుగా ఓడిన ముంబై

Chennai Super Kings : ఐపీఎల్ 2026లో ముంబై కథ ముగిసినట్టే. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

Chennai Super Kings

ఐపీఎల్ 2026లో ముంబై కథ ముగిసినట్టే. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ అట్టర్ ఫ్లాప్ అయింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో విజయాన్ని అందుకుంటే ఏడో ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపుగా దూరమైంది. ముంబై మిగిలిన ఐదు మ్యాచ్ లూ గెలిచినా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో పిచ్‌పై మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. తర్వాత పరుగులు చేసేందుకు ముంబై బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గత మ్యాచ్‌లో మెరుపు ఆరంభం ఇచ్చిన విల్ జాక్స్ నిరాశపరిచాడు. నమన్ ధీర్ హాఫ్ సెంచరీ సాధించగా… ర్యాన్ రికెల్టన్ 24 బంతుల్లో 37 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా సమిష్టిగా విఫలమయ్యారు.

సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫ్లాప్ అయ్యాడు. 12 బంతుల్లో 21 రన్స్ కు ఔటయ్యాడు. తిలక్ వర్మ (5), రాబిన్ మింజ్ (5) నిరాశపరిచారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా సేపు క్రీజులో ఉన్నప్పటికీ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. 23 బంతులు ఎదుర్కొన్న పాండ్యా కేవలం 18 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 3 వికెట్లు , నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. జెమీ ఓవర్టన్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 23 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ముంబై తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కీలకపాత్ర పోషించాడు.

ఛేజింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ త్వరగానే సంజూ శాంసన్ (11) వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో సంజూ వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ , ఉర్విల్ పటేల్ దూకుడుగా ఆడారు. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.వీరిద్దరూ రెండో వికెట్ కు 22 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు.

Chennai Super Kings
Chennai Super Kings

ఉర్విల్ పటేల్ 12 బంతుల్లో 24 రన్స్ కు ఔటైనా కార్తీక్ శర్మతో కలిసి రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ముంబై బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. మూడో వికెట్ కు అజేయంగా 98 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది.

రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 67 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) , కార్తీక్ శర్మ 40 బంతుల్లో 54 (4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ సీజన్ లో చెన్నైకి ఇది నాలుగో విజయం. అటు ముంబైకి ఇది ఏడో ఓటమి.

Harmanpreet Kaur : ఐదోసారి కెప్టెన్ గా హర్మన్ ప్రీత్..టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఇదే

Related Articles

Back to top button