Just SportsLatest News

Cristiano Ronaldo : ఒక శకం ముగిసింది.. పోర్చుగల్ జెర్సీకి క్రిస్టియానో రొనాల్డో గుడ్‌బై

Cristiano Ronaldo : పోర్చుగల్ జట్టులో 23 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన రొనాల్డో.. ప్రతిష్టాత్మక 7వ నంబర్ జెర్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.

Cristiano Ronaldo

ప్రపంచ క్రీడా జగత్తులో ఎప్పటికప్పుడు నయా హిస్టరీని సృష్టించిన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo).. తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పడం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. పోర్చుగల్ జట్టులో 23 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన రొనాల్డో.. ప్రతిష్టాత్మక 7వ నంబర్ జెర్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. నేషనల్ ఫుట్‌బాల్ టీమ్‌కు అత్యధిక మ్యాచ్‌లు ఆడటమే కాకుండా, ఎక్కువ గోల్స్ సాధించిన ఆటగాడిగా రొనాల్డో సాధించిన రికార్డులు ఇప్పటికే కాదు ఎప్పటికీ ఫుట్‌బాల్ చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి.

తన కెరీర్‌లో ఎన్నో ఘనతలు, ఉన్నత శిఖరాలు అధిరోహించిన రొనాల్డోకు ప్రపంచకప్ అందుకోవాలనే కల మాత్రం నెరవేరలేదు. 2006లో సెమీఫైనల్ చేరడమే వరల్డ్ కప్‌లో ఆయన సాధించిన అత్యుత్తమ ప్రదర్శనగా మిగిలిపోయింది. అయినా కూడా 2016లో పోర్చుగల్‌కు తొలిసారి యూరో కప్ అందించడంలో అలాగే రెండుసార్లు నేషన్స్ లీగ్ విజేతగా నిలపడంలోనూ రొనాల్డో చూపిన చొరవ అసామాన్యం అంటారు ఆయన అభిమానులు. మైదానంలో రొనాల్డో చూపించే పట్టుదల, క్రీడాస్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మందికి రోల్ మోడల్‌గా నిలిచాయి.

కోచ్‌తో వచ్చిన కొన్ని విభేదాలు అలాగే ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య రొనాల్డో ఈ డెసిషన్ తీసుకున్నా కూడా, పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య ఆయన సేవలను కొనియాడింది. 41 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు గుడ్‌బై చెప్పిన రొనాల్డో, క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం 979 గోల్స్‌తో ఉన్న రొనాల్డో(Cristiano Ronaldo), 1,000 గోల్స్ అనే ఆల్‌టైమ్ రికార్డు మైలురాయిని చేరుకోవడమే నెక్స్ట్ టార్గెట్‌గా క్లబ్ మ్యాచ్‌లలో కొనసాగనున్నారు.

Vijayasai Reddy : సాయన్న సాయం వామ్‌ అప్‌ సాంగ్‌తో ఏపీ పాలిటిక్స్‌లో హీట్..నవంబర్ 11 కోసం వెయిటింగ్..

Related Articles

Back to top button