CSK : చెపాక్ లో గర్జించిన దిగ్గజాలు.. సీఎస్కే మాజీల ఎగ్జిబిషన్ మ్యాచ్
CSK : ఐపీఎల్ 19వ సీజన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుండగా..ఫ్యాన్స్ హంగామా మాత్రం అప్పుడే మొదలైంది
CSK
ఐపీఎల్ 19వ సీజన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుండగా..ఫ్యాన్స్ హంగామా మాత్రం అప్పుడే మొదలైంది. అన్ని జట్లు తమ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహిస్తూ సందడి చేస్తున్నాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఫ్రాంచైజీ చెపాక్ స్టేడియంలో ఫ్యాన్ ఈవెంట్ ఏర్పాటు చేసింది.
రోర్ 2026 పేరుతో సాగిన ఈ ఈవెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాళ్లందరూ సందడి చేశారు. ధోనీ కెప్టెన్సీలో ఆడిన సురేష్ రైనా, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, అంబటి రాయుుడు, బద్రీనాథ్, మైక్ హస్సీ, హెడెన్, బ్రేవో వంటి మాజీ ప్లేయర్స్ అందరూ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి అభిమానులను అలరించారు. తమ అభిమాన క్రికెటర్లందరూ మ్యాచ్ ఆడుతుండడంతో ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ధోనీ స్టేడియంలోకి అడుగుపెట్టగానే మారుమోగిపోయింది.
కొత్తగా చెన్నై జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ పేరు కూడా స్టేడియంలో మోత మోగింది. అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియం అంతటా తిరిగిన ధోనీ, ఇతర చెన్నై క్రికెటర్లు వారికి జెర్సీలు గిఫ్ట్స్ గా అందజేశారు. సీఎస్కే మాజీ క్రికెటర్లందరూ భారీ షాట్లతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశారు.

చెన్నై గెలిచిన ఐదు ట్రోఫీలను స్టేడియంలోకి తీసుకొచ్చి ప్రదర్శించారు. ఈ సందర్భంగా విండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో హుషారుగా పాటలు పాడుతూ మరింత జోష్ పెంచాడు. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కన్సెర్ట్ కూడా ఆకట్టుకుంది. పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ రెహమాన్ అభిమానులను ఉర్రూతలూగించాడు.
కాగా గత సీజన్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్ లో చెన్నై తన తొలి మ్యాచ్ ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపయింది. ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడని భావిస్తున్నారు.
Nithin :సక్సెస్ కోసం నితిన్ మాస్టర్ ప్లాన్.. వరుస సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర





