Just SportsLatest News

CSK vs RR : కింగ్స్ వర్సెస్ రాయల్స్…నేడు చెన్నైతో రాజస్థాన్ ఢీ

CSK vs RR : ఐపీఎల్ 19వ సీజన్ లో ఇవాళ ఆసక్తికర పోరు జరగబోతోంది. లీగ్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది

CSK vs RR

ఐపీఎల్ 19వ సీజన్ లో ఇవాళ ఆసక్తికర పోరు జరగబోతోంది. లీగ్ లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్(CSK vs RR )తో తలపడనుంది. కండరాల నొప్పితో ధోనీ దూరమైన నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీకి ఈ సీజన్ పరీక్షగా మారనుందని చెప్పొచ్చు. ఎందుకంటే కెప్టెన్ గా లేకున్నా గ్రౌండ్ లో ధోనీ ఉంటే వ్యూహాల పరంగా చెన్నైకి చాలా అడ్వాంటేజ్.

అయితే కండరాల నొప్పి కారణంగా ధోనీ ఆరు మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం లేదు. ఇది చెన్నైకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్ లో నిరాశ పరిచింది. 14 మ్యాచ్ లలో కేవలం నాలుగే విజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. మినీ వేలంలో పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

దాని కంటే ముందు ట్రేడింగ్ లో జడేజా, సామ్ కరన్ లను ఇచ్చేసి సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకుంది. సంజూ శాంసన్ కు కెప్టెన్సీ అప్పగిస్తారని ప్రచారం జరిగినా రుతురాజ్ నే కొనసాగిస్తోంది. అయితే భవిష్యత్తులో సంజూకు సారథ్య బాధ్యతలు దక్కొచ్చు. ఇక సీఎస్కే బ్యాటింగ్ లైనప్ ను చూసుకుంటే సంజూ,రుతురాజ్ ఓపెనర్లుగా రానుండగా.. ఆయుశ్ మాత్రే వన్ డౌన్ లో దిగుతాడు.

తర్వాత బ్రెవిస్ , శివమ్ దూబే, ప్రశాంత్ వీర్ వంటి వారితో పటిష్టంగానే ఉంది. అటు బౌలింగ్ లో జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్ లపైనే భారం పడనుంది. మరో మీడియం పేసర్ గా అన్షుల్ కాంబోజ్ పైనా చెన్నై ఆశలు పెట్టుకుంది. స్పిన్ విభాగంలో నూర్ అహ్మద్ తో పాటు రాహుల్ చహర్ కీలకం కానున్నాడు. కాగా ధోనీ దూరమవడంతో కీపింగ్ బాధ్యతలు సంజూనే తీసుకోనున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా కార్తీక్ శర్మను ఆడించే అవకాశముంది.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా గత సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈజీగా గెలిచే కొన్ని మ్యాచ్ లను చేజేతులా ఓడిపోయింది. ఫలితంగా నాలుగే విజయాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. జైశ్వాల్ , వైభవ్ సూర్యవంశీ, , హిట్ మెయిర్ లాంటి హిట్టర్లున్నా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

CSK vs RR
CSK vs RR

ఈ సారి సంజూ శాంసన్ ను ట్రేడింగ్ లో వదులుకున్న రాయల్స్ జడేజా, సామ్ కరన్ లను తీసుకుంది. అయితే సామ్ కరన్ గాయంతో సీజన్ కు దూరమవడం రాజస్థాన్ కు ఎదురుదెబ్బగానే చెప్పాలి. ప్రస్తుతం సంజూ స్థానంలో రియాన్ పరాగ్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. గత సీజన్ లో కూడా పరాగ్ రాజస్థాన్ ను నడిపించినా కెప్టెన్ గా ఇంప్రెస్ చేయలేదు.

కాగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ లో వైభవ్ సూర్యవంశీ పైనే అందరి చూపు ఉంది. 15 ఏళ్ల వైభవ్ గత సీజన్ లో దుమ్మురేపాడు. అరంగేట్రం చేసిన సీజన్ లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. ఇటీవల అండర్ 19 ప్రపంచకప్ లోనూ పరుగుల వరద పారించిన వైభవ్ సూర్యవంశీ నుంచి రాయల్స్ మెరుపు ఆరంభాలను ఆశిస్తోంది.

జైస్వాల్, వైభవ్ జోడీతో పాటు రియాన్ పరాగ్ , హెట్ మెయిర్ , జురెల్ కూడా రాణిస్తే రాయల్స్ కు తిరుగుండదు. బౌలింగ్ లో ఆర్చర్, సందీప్ శర్మ , ఆడమ్ మిలైన్ పేస్ భారాన్ని మోయనుండగా.. రవి బిష్ణోయ్ స్పిన్నర్ గా ఉన్నాడు. రాజస్థాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా హైదరాబాదీ క్రికెటర్ అమన్ రావును ఆడించే అవకాశముంది.

Israel : ఇజ్రాయిల్ కోసం మమ్మల్ని బలిపెడతావా ?..ట్రంప్ ను ఏకిపారేస్తూ అమెరికన్ల నిరసనలు

Related Articles

Back to top button