Israel : ఇజ్రాయిల్ కోసం మమ్మల్ని బలిపెడతావా ?..ట్రంప్ ను ఏకిపారేస్తూ అమెరికన్ల నిరసనలు
Israel : అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు అటు పొరుగు దేశాలకే కాదు సొంత ప్రజలకు సైతం నచ్చడం లేదు
Israel
అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు అటు పొరుగు దేశాలకే కాదు సొంత ప్రజలకు సైతం నచ్చడం లేదు. ఇప్పటికే పలు విషయాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. తాజాగా ఇరాన్ తో యుద్ధంలోనూ ట్రంప్ పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నిజానికి యుద్ధం ఆరంభించినప్పుడు ట్రంప్ మరో దేశంపై ఆధిపత్యం కనబరుస్తారని అందరూ అనుకున్నారు. వెనిజులా తరహాలో ఇరాన్ కూడా లొంగిపోతుందేమోనని భావించారు. కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. ట్రంప్ కూడా ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటిస్తుందని అస్సలు అనుకోలేదు. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే ప్రస్తుతం యుద్ధంలో ఇరాన్ దే పైచేయిగా ఉంది. అమెరికా రక్షణ వ్యవస్థ బలం కూడా తగ్గిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అలా అని అమెరికా చేతులెత్తేసే పరిస్థితి లేదనీ, ఓవరాల్ గా మాత్రం ఇరాన్ పైచేయిని అంగీకరించాల్సిందేనని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని చూసిన తర్వాత అమెరికన్లలో అసహనం, ఆగ్రహం మొదలయ్యాయి. తాజాగా ఇరాన్ యుద్ధం, ట్రంప్ వలసల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లెక్కారు.
పలు ప్రాంతాల్లో వేలాదిగా రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అమెరికా మాత్రమే కాదు ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో ట్రంప్ ను ఏకిపారేస్తూ నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులు, భారీ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. కిరీటాన్ని కింద పెట్టేసేయ్ విదూషకుడా… నో కింగ్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, ఇంధన సంక్షోభం తలెత్తడంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అనవసరంగా ఇజ్రాయిల్(Israel) కోసం యుద్ధంలో తలదూర్చి అమెరికాను ఇబ్బందుల్లోకి నెట్టారంటూ ట్రంప్ పై విరుచుకుపడుతున్నారు.
ఇజ్రాయిల్(Israel) కోసం తమ ప్రాణాలను పణంగా పెడతారా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పటి వరకూ కోటి మంది ప్రజలు నిరసనల్లో పాల్గొన్నట్టు చెబుతున్నారు. మరోవైపు వైట్ హౌస్ ఈ నిరసనలు తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష పార్టీల కుట్రగా అభివర్ణిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ నిరసనలకు ప్రజల నుంచి మద్ధతు లేదని పేర్కొంది.
అయితే ట్రంప్ కు మాత్రం ఈ వ్యతిరేక సెగ కేవలం యుద్ధం వల్ల మాత్రమే వచ్చింది కాదు. గత ఏడాది కాలంగా తీసుకున్న నిర్ణయాలు కూడా కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు యుద్ధం తీవ్రత కూడా దానికి తోడైంది.
TVK Vijay : వ్యూహాలకు పదును పెట్టిన విజయ్..టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల





