DC vs KKR : ఢిల్లీ, కోల్ కతా డూ ఆర్ డై..ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ కష్టమే
DC vs KKR : ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ లో కొన్ని జట్లకు డూ ఆర్ డై పరిస్థితి వచ్చేసింది. ఇకపై ప్రతీ గెలుపు లేదా ఓటమి ఆయా జట్ల ప్లే ఆఫ్ ఫ్యూచర్ ను నిర్ణయిస్తుంది
DC vs KKR
ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ లో కొన్ని జట్లకు డూ ఆర్ డై పరిస్థితి వచ్చేసింది. ఇకపై ప్రతీ గెలుపు లేదా ఓటమి ఆయా జట్ల ప్లే ఆఫ్ ఫ్యూచర్ ను నిర్ణయిస్తుంది. దీనిలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్(DC vs KKR )కీలక మ్యాచ్ కు సిద్ధమయ్యాయి. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇరు జట్లకూ ఈ మ్యాచ్ అత్యంత కీలకం.
కాకుంటే ఢిల్లీ కంటే ఒక మ్యాచ్ తక్కువ ఆడి ఉండడం కేకేఆర్(DC vs KKR )కు అడ్వాంటేజ్. ఆరంభంలో ఐదు పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోల్ కతా నైట్ రైడర్స్ తర్వాత హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో ఆశలు నిలుపుకుంది. ఇప్పుడు నిలకడలేని ఆటతీరుతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలవాలని ఎదురుచూస్తోంది.
గత మ్యాచ్ లో కోల్ కతా అదిరిపోయే ఆటతీరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాకిచ్చింది. బౌలర్లు ఫామ్ కొనసాగించడం, బ్యాటర్లు రాణించడంతో మూడో విజయాన్ని అందుకుంది. బౌలింగ్ లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నారు. ఈ సీజన్ ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపని ఈ స్పిన్ ద్వయం ఇప్పుడు అదరగొడుతోంది.
అటు పేస్ ఎటాక్ లో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీలతో పాటు కామెరూన్ గ్రీన్ కూడా ఉన్నాడు. సన్ రైజర్స్ పై వీరంతా కలిసికట్టుగా రాణించి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించారు. మరోసారి అదే జోరును కొనసాగిస్తే ఢిల్లీకి కష్టాలు తప్పవు. ఇటు బ్యాటింగ్ లో ఫిన్ అలెన్, రహానేతో పాటు రఘువంశీ, రింకూ సింగ్ , గ్రీన్ లపై అంచనాలున్నాయి.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఆరంభంలో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఢిల్లీ తర్వాత గాడి తప్పింది. మధ్యలో హ్యాట్రిక్ ఓటములతో ప్లే ఆఫ్ రేసులో వెనుకబడిపోయింది. తర్వాత పుంజుకుని రాజస్థాన్ రాయల్స్ పై గెలిచినా చెన్నై చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది.

దీంతో ఇప్పుడు ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కేకేఆర్ పై ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటి వరకూ 10 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ నాలుగింటిలో గెలిచి ఆరు మ్యాచ్ లు ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఢిల్లీ రన్ రేట్ ను కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. నిలకడ లేని బ్యాటింగ్ ఢిల్లీకి ప్రధాన సమస్యగా మారింది.
కెఎల్ రాహుల్ రాణిస్తున్నా మిగిలిన వారిలో నిస్సాంక, నితీశ్ రాణా , రిజ్వీ , స్టబ్స్ తడబడుతున్నారు. అక్షర్ పటేల్ ఒక్కసారి కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. అటు బౌలింగ్ లో ఎంగిడి రావడం ఢిల్లీ బలం పెరిగింది. నటరాజన్ ,స్టార్క్ రాణిస్తుండగా.. స్పిన్ విభాగంలో కుల్దీప్ పూర్తి ఫామ్ అందుకోలేదు. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 35 సార్లు తలపడగా కోల్ కతా 19 మ్యాచ్ లలోనూ, ఢిల్లీ(DC vs KKR )15 మ్యాచ్ లలోనూ గెలిచాయి.
Mamata Banerjee : మమతా బెనర్జీకి షాక్..బెంగాల్ ప్రభుత్వం బర్తరఫ్





