Just SportsLatest News

Devdutt Padikkal : సెంచరీ బాదిన పడిక్కల్ .. నిరాశ పరిచిన జైస్వాల్, పంత్, జురెల్

Devdutt Padikkal : లంక ఎలెవన్ స్కోరు ఇంకా 6 పరుగులు వెనుకబడిన భారత్ మూడోరోజు మరింత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశముంది.

Devdutt Padikkal

శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో వన్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో అదరగొట్టాడు. కీలక బ్యాటర్లు విఫలమవడంతో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 363/8 దగ్గరే లంక ఎలెవన్ డిక్లేర్ చేయడంతో రెండో రోజు భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది.

రెండో బంతికే ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌటయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్‌తో కలిసి పడిక్కల్(Devdutt Padikkal) ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. రాహుల్ 40 పరుగుల దగ్గర ఔటవగా తర్వాత పడిక్కల్, జడేజా పార్టనర్‌షిప్ భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది.

అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా, పడిక్కల్‌తో కలిసి లంక బౌలర్లపై ఆధిపత్యం కనబరిచాడు. దీంతో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. పడిక్కల్ చాలా రోజుల తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

జడేజా, పడిక్కల్ మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. పడిక్కల్ సెంచరీ పూర్తి చేసుకుని మిగిలిన బ్యాటర్లకు ప్రాక్టీస్ కావాలన్న ఉద్దేశంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే అంచనాలు పెట్టుకున్న రిషబ్ పంత్ (2), ధృవ్ జురెల్ (1) నిరాశపరిచారు. ఈ దశలో జడేజాతో కలిసి మానవ్ సుతార్ 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సుతార్ 40 ఔటవగా, జడేజా 63 పరుగుల దగ్గర రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లాడు.

Devdutt Padikkal
Devdutt Padikkal

అనంతరం పడిక్కల్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి స్కోరు పెంచాడు. చివర్లో సారాంశ్ జైన్ (26), గుర్నూర్ బ్రార్ మెరుపులతో స్కోరు 350 దాటింది. బ్రార్ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36 పరుగులు చేయగా, పడిక్కల్ 142 (18 ఫోర్లు) పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి భారత్ 6 వికెట్లకు 357 పరుగులు చేసింది.

లంక ఎలెవన్ బౌలర్లలో రమేష్ మెండిస్ 2, సంక మనోజ్ 2 వికెట్లు పడగొట్టారు. లంక ఎలెవన్ స్కోరు ఇంకా 6 పరుగులు వెనుకబడిన భారత్ మూడోరోజు మరింత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశముంది. ఇదిలా ఉంటే కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బ్యాటింగ్‌కు దిగలేదు. అయితే తొలి టెస్ట్ సమయానికి అతను కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశాభావంతో ఉంది.

Ghee : నెయ్యి తింటే లావవుతారా? లేక హెల్త్‌కు బూస్ట్ అవుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Related Articles

Back to top button