Just SportsLatest News

IND vs ENG : భారత్ పరువు దక్కేనా ? ఇంగ్లాండ్‌తో నేడు చివరి టీ20

IND vs ENG : సౌతాంప్టన్ వేదికగా భారత్ , ఇంగ్లాండ్‌తో ఆఖరి టీ ట్వంటీ ఆడబోతోంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.

IND vs ENG

ఐర్లాండ్ సిరీస్ ఓటమితో షాక్ తిన్న భారత్‌కు ఇంగ్లాండ్(IND vs ENG) గడ్డపైన కూడా ఘోరపరాజయం ఎదురైంది. వరుసగా మూడు మ్యాచ్‌లలోనూ ఓడిపోయి సిరీస్‌ను 3-0 తో చేజార్చుకుంది. ఇప్పుడు వైట్ వాష్ పరాభవం ముంగిట చివరి టీ20కి రెడీ అయింది.

శనివారం సౌతాంప్టన్ వేదికగా భారత్ , ఇంగ్లాండ్‌తో(IND vs ENG) ఆఖరి టీ ట్వంటీ ఆడబోతోంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఇది అగ్నిపరీక్షగా చెప్పాలి. సూర్యకుమార్ నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

ఐర్లాండ్ గడ్డపై రెండు టీ ట్వంటీలు ఓడిపోయిన భారత్ తర్వాత ఇంగ్లాండ్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి చవి చూసింది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అదరగొట్టిన శ్రేయాస్ అంచనాలు అందుకోలేక ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. విదేశీ పిచ్‌లపై మన బ్యాటర్ల బలహీనత బయటపడినట్టే, విదేశీ గడ్డపై శ్రేయాస్ కూడా తన పేలవ కెప్టెన్సీతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.

అటు కోచ్ గంభీర్ వ్యూహాలపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో వైట్ వాష్ పరాభవం తప్పించుకోవడానికి టీమిండియా ఎంతవరకూ పోరాడుతుందో చూడాలి. కాగా వరుస పరాజయాల వల్ల భారత తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ కాంబినేషన్‌ను కొనసాగిస్తారా లేదా సంజూ శాంసన్‌ను మళ్లీ ట్రై చేస్తారా అనేది చూడాలి.

ఒకవేళ వైభవ్‌ను తప్పిస్తే సంజూ ఓపెనర్‌గా ఆడతాడు. లేదంటే ఇషాన్ కిషన్‌ను తప్పించి సంజూను వన్ డౌన్‌లో ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇషాన్ కిషన్ వరుసగా విఫలమవుతుండడం కూడా మేనేజ్మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. అటు తిలక్ వర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడన్న విమర్శలు తిలక్‌పై వస్తున్నాయి. చివరి టీ20లో తిలక్ వర్మ చెలరేగి ఆడాలని టీమ్ కోరుకుంటోంది.

IND vs ENG
IND vs ENG

బౌలింగ్‌లో స్పిన్ విభాగానికి సంబంధించి అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కొనసాగనున్నారు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్‌ను తప్పిస్తే సూర్యాన్షు షెగ్దేకు అవకాశం దక్కొచ్చు. పేస్ విభాగంలో హర్షిత్ రాణా గాయపడడంతో అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ కొనసాగుతారు. మరోవైపు చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 4-0తో గెలవాలని ఇంగ్లాండ్ ఎదురుచూస్తోంది.

దీని ద్వారా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్‌లో సాల్ట్ , బ్రూక్ సూపర్ ఫామ్‌లో ఉండగా, బౌలింగ్‌లో ఆర్చర్ , టంగ్ సత్తా చాటుతున్నారు. ఏది ఏమైనా పరువు కోసం భారత్, వైట్ వాష్ కోసం ఇంగ్లాండ్ ఎదురుచూస్తున్న వేళ చివరి టీ20 హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

Amarnath Yatra : అమర్‌నాథ్ పవిత్ర దర్శనానికి పోటెత్తిన భక్తులు..ఇప్పటివరకు 1.6 లక్షల మందికి పైగా హాజరు

Related Articles

Back to top button