IND vs WI : దంచికొట్టిన సంజూ..సెమీఫైనల్లో భారత్
IND vs WI : టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో వెస్టిండీస్ ను చిత్తు చేసింది.

IND vs WI
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో వెస్టిండీస్ ను చిత్తు చేసింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ భారీస్కోరు చేయగా.. భారత్ కూడా దీటుగా స్పందించి లక్ష్యాన్ని ఛేదించింది.
అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోలేకపోతూ విమర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్ ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపించాడు. కీలక ఇన్నింగ్స్ తో భారత్ ను సెమీస్ కు చేర్చాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ భారీస్కోరు చేయడమే లక్ష్యంగా ఆడింది. ఓపెనర్లు హోప్ , ఛేజ్ తొలి వికెట్ కు 68 పరుగులు జోడించారు.
హోప్ 32, ఛేజ్ 40 పరుగులకు ఔటవగా.. హెట్ మెయిర్ (12 బంతుల్లో 27 ) మెరుపులు మెరిపించినా అతన్ని భారత బౌలర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలువనివ్వలేదు. రూథర్ ఫర్డ్ (14) ఔటైనా సరే.. రోవ్ మన్ పావెల్ , హోల్డర్ ధాటిగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 35 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పావెల్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 , హోల్డర్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. వీరిద్దరి మెరుపులతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, హార్థిక్ , వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత ఫీల్డర్లు పలు క్యాచ్ లు జారవిడవడం విండీస్ కు కలిసొచ్చింది. రెండు సులభమైన క్యాచ్ లను అభిషేక్ శర్మ వదిలేయగా ఆ అవకాశాన్ని కరేబియన్ బ్యాటర్లు బాగానే వినియోగించుకున్నారు.
భారీ లక్ష్యమే అయినాసరే ఈడెన్ గార్డెన్స్ ఛేజింగ్ పిచ్ కావడం, మంచు ప్రభావం ఉండడంతో భారత్ విజయం సాధిస్తుందని ముందే అంచనా వేశారు. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ భారీ ఆరంభాన్నివ్వలేకపోవడం షాకిచ్చింది.

అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఇషాన్ కిషవ్ (10) , సూర్యకుమార్ యాదవ్ (18) కూడా త్వరగానే ఔటవడంతో కాస్త టెన్షన్ కనిపించింది. ఈ దశలో సంజూ శాంసన్ తో కలిసి తెలుగుతేజం తిలక్ వర్మ అదరగొట్టాడు. తిలక్ వర్మ, సంజూ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తిలక్ వర్మ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో 27 రన్స్ కు వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో కలిసి సంజూ శాంసన్ ముందుకు నడిపించాడు. పాండ్యా 17 రన్స్ కు ఔటైన తర్వాత ఉత్కంఠ నెలకొంది.
ఈ దశలో శివమ్ దూబే రెండు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించాడు. కాగా చాలా రోజుల తర్వాత మెరిసిన సంజూ ఇలాంటి డూ ఆర్ డై మ్యాచ్ లో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం అభిమానులకు ఎక్కడలేని జోష్ ఇచ్చింది. తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ భారత్ ను సెమీఫైనల్ కు చేర్చిన సంజూ పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తూ జట్టును గెలిపించాడు.
మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



