Just SportsLatest News

India : వన్డే సిరీస్‌లో పరాజయం ..లార్డ్స్‌లో పోరాడి ఓడిన భారత్

India : కోహ్లీ, రోహిత్ శర్మ 113 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ను బెథల్ బౌల్డ్ చేశాడు. ఇక్కడ నుంచి భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది.

India

ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్‌లో వైట్ వాష్ అయిన భారత్ వన్డే సిరీస్‌లోనూ పరాజయం పాలైంది. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో పోరాడి ఓడింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ సెంచరీతో దుమ్మురేపగా, గిల్, కోహ్లీ సైతం మంచి ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివర్లో వరుస వికెట్లు కోల్పోవడం భారత్ ఓటమికి కారణమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో చాలా మార్పులు జరిగాయి. గాయంతో బుమ్రా దూరమవడం కొంపముంచింది. అటు కేఎల్ రాహుల్, ప్రిన్స్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. బుమ్రా లేకపోవడంతో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.

ఇంగ్లాండ్ ఓపెనర్లు బెథెల్, డకెట్ చెలరేగి ఆడారు. వీరిద్దరూ టీమిండియా యువ పేసర్లందరినీ ఉతికారేశారు. తొలి వికెట్‌కు 30 ఓవర్లలో 192 పరుగులు జోడించారు. అలా బెథెల్ 93 (91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకున్నా.. మరో ఓపెనర్ డకెట్ మాత్రం శతకం సాధించాడు.

రూట్, డకెట్ కలిసి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి జోరుతో ఇంగ్లాండ్ రన్ రేట్ ఓవర్‌కు ఏడు పరుగులకు పైగా సాగింది. సెంచరీ తర్వాత డకెట్ మరింత దూకుడుగా ఆడాడు. అటు రూట్ కూడా మెరుపులు మెరిపించాడు. డకెట్ 135 బంతుల్లో 141 (18 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులకు ఔటవగా తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రూక్ త్వరగానే వెనుదిరిగాడు.

అయితే చివర్లో జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రూట్‌తో కలిసి కేవలం 19 బంతుల్లోనే 63 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. దీంతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసింది. రూట్ 48 బంతుల్లో 9 ఫోర్లతో 74 నాటౌట్, బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. గుర్నూర్ బ్రార్ తన 10 ఓవర్ల స్పెల్‌లో 97 పరుగులిచ్చాడు.

ఛేజింగ్‌లో భారత్(India) ఆరంభంలో కాస్త నిదానంగా ఆడింది. క్రీజులో నిలదొక్కుకోవడానికి కొద్ది సమయం తీసుకున్న గిల్ , రోహిత్ తర్వాత బ్యాట్‌కు పని చెప్పారు. తొలి వికెట్‌కు 24.2 ఓవర్లలోనే 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలా గిల్ 77 (10 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులకు ఔటైనా, రోహిత్ శర్మ తన దూకుడు కొనసాగించాడు.

India
India

రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ విపరీతమైన ప్రచారం జరిగిన వేళ తనలో ఆట ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఒకప్పటి హిట్ మ్యాన్‌ను గుర్తు చేస్తూ చాలా రోజుల తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ వన్డే కెరీర్‌లో ఇది 34వ సెంచరీ.

కోహ్లీ, రోహిత్ శర్మ 113 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ను బెథల్ బౌల్డ్ చేశాడు. ఇక్కడ నుంచి భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ (14), శ్రేయాస్ అయ్యర్ (0) , కోహ్లీ (74), కేఎల్ రాహుల్ (12) కూడా ఔటవడంతో భారత్(India) ఓటమి ఖాయమైంది.

Trainee IPS : పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అరాచకం..లేడీ ఐపీఎస్ ఆఫీసర్‌కు వేధింపులు

Related Articles

Back to top button