IPL : హార్దిక్ అటు… జైస్వాల్ ఇటు..ఐపీఎల్ లో మరో ట్రేడింగ్ డీల్
IPL : హార్దిక్ పాండ్యాను ఇచ్చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి యశస్వి జైస్వాల్ ను తీసుకునేందుకు ముంబై ప్రయత్నిస్తోంది
IPL
ఐపీఎల్ 19వ సీజన్ నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ తమ జట్టులో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కీలక ఆటగాళ్లలో కొందరిని వదులుకునే ప్రణాళికల్లో ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టును వీడనున్నాడనే ప్రచారం బాగా జరుగుతోంది.
తాజాగా ఈ ప్రచారానికి మరింత బలం చేకూరేలా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యాను ఇచ్చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి యశస్వి జైస్వాల్ ను తీసుకునేందుకు ముంబై ప్రయత్నిస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే హార్దిక్ కు
ముంబై ఫ్రాంచైజీతోనూ, జైస్వాల్ కు రాజస్థాన్ ఫ్రాంచైజీతోనూ సంబంధాలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ భారీ ట్రేడింగ్ లో గుజరాత్ టైటాన్స్ నుంచి దక్కించుకుంది. అప్పటికే గుజరాత్ కు తొలి సీజన్ లో టైటిల్ అందించడంతో హార్దిక్ పై అంచనాలు పెరిగిపోయాయి.
అయితే ముంబై ఫ్యాన్స్ కు మాత్రం సారథిగా రోహిత్ ను తప్పించి పాండ్యాకు పగ్గాలు ఇవ్వడం నచ్చలేదు. ఆ సీజన్ లో పాండ్యా కూడా సారథిగా ఆకట్టుకోలేకపోయాడు. గత రెండు సీజన్లలోనూ ప్లేయర్ గానూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పైగా జట్టులో హార్దిక్ మాటకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా జరిగింది. ఈ సందర్భంగా ముంబైని వీడేందుకు సీజన్ మధ్యలోనే పాండ్యా నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
మరోవైపు జైస్వాల్ కూడా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు విపిస్తున్నాయి. సంజూ శాంసన్ ను ట్రేడింగ్ లో చెన్నైకి ఇచ్చేసిన తర్వాత జైస్వాల్ కు పగ్గాలు అప్పగిస్తారని భావించారు. అయితే రాజస్థాన్ యాజమాన్యం మాత్రం రియాన్ పరాగ్ కు కెప్టెన్సీ ఇచ్చింది.

దీనికి తోడు వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాత జైస్వాల్ కు జట్టులో ప్రాధాన్యత లేదని అర్థమవుతోంది. ఈ సందర్భంలో తన సొంత ఫ్రాంచైజీ ముంబైకి వెళ్లాలని జైస్వాల్ భావిస్తున్నాడు.దీంతో ట్రేడింగ్ చర్చలు సఫలమైతే మాత్రం హార్దిక్ రాజస్థాన్ కు , జైస్వాల్ ముంబైకి వెళ్లిపోవడం ఖాయం.
ఇదిలా ఉంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై జట్టును వీడతాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్ల ఆటతీరుపై ముంబై యాజమాన్యం అంత సంతృప్తిగా లేకపోవడంతో ఇక యువ క్రికెటర్లపైనే ఆ ఫ్రాంచైజీ ఫోకస్ పెట్టనుంది.
Minister Anam : సాయిబాబా గుడులకు ఆ నిధులు ఇవ్వం..మంత్రి ఆనం కామెంట్లపై మొదలైన కొత్త చర్చ..





