Mitchell Marsh : శతక్కొట్టిన మిఛెల్ మార్ష్..ఆర్సీబీకి లక్నో షాక్
Mitchell Marsh : ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి షాక్ తగిలింది. ఊహించని విధంగా లక్నో సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది
Mitchell Marsh
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి షాక్ తగిలింది. ఊహించని విధంగా లక్నో సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. లక్నో ఓపెనర్ మిఛెల్ మార్ష్(Mitchell Marsh) సెంచరీతో చెలరేగిన వేళ, బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఈ సీజన్ లో లక్నోకు ఇది మూడో విజయం.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు మిఛెల్ మార్ష్(Mitchell Marsh) , కులకర్ణి మెరుపు ఆరంభాన్నిచ్చారు. మార్ష్ విధ్వంకర బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. తొలి వికెట్ కు 9.2 ఓవర్లలోనే 95 పరుగులు జోడించాడు. కులకర్ణి (17) పరుగులకు ఔటవగా… మార్ష్ కు పూరన్ జతకలిసాడు.
వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మధ్య మధ్యలో వరుణుడు అడ్డుపడుతూ చికాకు పెట్టినా మార్ష్ , పూరన్ అదరగొట్టారు. భారీ షాట్లతో చెలరేగిన వీరి జోడీ రెండో వికెట్ కు 41 బంతుల్లోనే 70 పరుగులు జోడించింది. ఈ క్రమంలో మార్ష్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన లక్నో క్రికెటర్గా మిచెల్ మార్ష్ అరుదైన ఘనత సాధించాడు.
రొమారియో షెఫర్డ్ వేసిన యార్కర్ ను బౌండరీ కొట్టి ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించిన మార్ష్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. లక్నో తరఫున రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు.
మార్ష్ 56 బంతుల్లో 111 పరుగులు చేసి వెనుదిరిగాడు. నికోలస్ పూరన్ 23 బంతుల్లో 38 , పంత్ 10 బంతుల్లోనే 32 పరుగులు చేశారు. దీంతో లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఆర్బీబీ బౌలర్లలో హ్యాజిల్ వుడ్, సలామ్ దార్, కృనాల్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.
ఛేజింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. బెథెల్ (4) , కోహ్లీ డకౌటయ్యారు. దీంతో కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది, ఈ దశలో రజత్ పటిదార్ , పడిక్కల్ ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచారు.

పటిదార్ సిక్సర్లతో విరుచుకుపడితే… పడిక్కల్ క్లాసిక్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. మూడో వికెట్ కు వీరి జోడీ కేవలం 53 బంతుల్లో 95 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పింది. ఈ క్రమంలో పటిదార్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పడిక్కల్ 34 పరుగులకు ఔటైనా పటిదార్ దూకుడు కొనసాగింది.
అయితే పటిదార్ 31 బంతుల్లో 61 (3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక సమయంలో వెనుదిరిగాడు. కాసేపటికే జితేశ్ శర్మ(1) కూడా ఔటయ్యాడు. అయితే చివర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా దూకుడుగా ఆడడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 40 రన్స్ కు ఔటవగా.. తర్వాత రూథర్ ఫర్డ్ , కృనాల్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది.
DC vs KKR : ఢిల్లీ, కోల్ కతా డూ ఆర్ డై..ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ కష్టమే





