Kohli :కింగ్ కోహ్లీ వీర విహారం..బెంగుళూర్ ఘన విజయం
Kohli : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ లో చెలరేగిపోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయిన వేళ, పడిక్కల్ మెరుపులు మెరిపించిన వేళ 206 పరుగుల టార్గెట్ చిన్నబోయింది
Kohli
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ లో చెలరేగిపోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయిన వేళ, పడిక్కల్ మెరుపులు మెరిపించిన వేళ 206 పరుగుల టార్గెట్ చిన్నబోయింది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. అంతే కాదు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.టాస్ గెలిచిన ఆర్సీబీ(RCB) కెప్టెన్ రజత్ పటీదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్లు సాయి సుదర్శన్ , శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడారు. తొలి వికెట్‌కు 76 బంతుల్లో 128 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్ కు ముందు వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని సాయి సుదర్శన్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. ధాటిగా ఆడిన సాయి శతకంతో మెరిశాడు.
మరో ఎండ్‌లో గిల్ సైతం దూకుడుగా ఆడాడు. సాయి సుదర్శన్ 58 బంతుల్లో 100 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 సిక్స్‌లు, 11 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో సాయి సుదర్శన్‌కు ఇది మూడో సెంచరీ. 2024, 2025, 2026 ఇలా వరుసగా మూడు సీజన్‌లలో శతకాలు బాదాడు.చివరి ఓవర్లో జాసన్ హోల్డర్ రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

చేజింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా చెలరేగిపోయింది. ఫ్లాట్ వికెట్ కావడంతో బౌండరీల వర్షం కురిసింది. బేతెల్ (14) రన్స్ కే ఔట్ అయినా విరాట్ కోహ్లీ)Virat Kohli), పడిక్కల్ విధ్వంసం సృష్టించారు. గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రెండో వికెట్ కు వీరిద్దరూ 59 బంతుల్లోనే 115 పరుగులు జోడించారు. ఆర్సీబీ 13 ఓవర్లకే 141 పరుగులు చేసింది.
కోహ్లీ(Kohli) కూడా క్లాసిక్ బ్యాటింగ్ తో అదరగొట్టేశాడు. కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు , 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సెంచరీ చేసేలా కనిపించినా ధాటిగా ఆడే క్రమంలో వెనుదిరిగాడు. పడిక్కల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 27 బంతుల్లోనే 55 రన్స్ చేశాడు. అయితే చివర్లో ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. వేగంగా మ్యాచ్ ను ముగించే హడావిడిలో అనవసరంగా వికెట్లు పారేసుకున్నారు. అయితే టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా మ్యాచ్ ను ఫినిష్ చేశారు. దీంతో బెంగళూరు 18.5 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది.
Lord Venkanna:రూ. 300 టికెట్లు దొరకలేదా? శ్రీవారి దర్శనానికి మరో ఈజీ మార్గం..





