Super Sports Sunday : ఈరోజు స్పోర్ట్స్ ఫ్యాన్స్‌కి పూనకాలే..భారత్ ఖాతాలో ఆ 4 కప్పులు పడతాయా?
Super Sports Sunday : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు వేర్వేరు టోర్నీలలో ఇండియన్ జట్లు మైదానంలోకి దిగి ప్రత్యర్థులను డీ కొట్టబోతున్నాయి.
Super Sports Sunday
వీకెండ్‌లో కూల్‌గా కూర్చుని మ్యాచ్ చూస్తే స్పోర్ట్స్ లవర్స్‌కు వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఐపీఎల్ సమయంలో తప్ప ఒకే రోజు డబుల్ లేదా ట్రిపుల్ యాక్షన్ చూడటం చాలా రేర్‌గా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సండే మాత్రం స్పోర్ట్స్ లవర్స్‌కి మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్ ఇస్తోంది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు వేర్వేరు టోర్నీలలో ఇండియన్ జట్లు మైదానంలోకి దిగి ప్రత్యర్థులను డీ కొట్టబోతున్నాయి. క్రికెట్, హాకీలలో ఒకే రోజు మనోళ్లు ఆడబోతున్న ఆ నాలుగు బిగ్ ఫైట్స్ షెడ్యూల్స్, టైమింగ్స్‌పై ఒక లుక్కేద్దాం.
మొదటిది, క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ అఫ్ఘనిస్తాన్ తొలి టీ20 పోరు ఈరోజే. దేశ రాజధాని ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ క్రికెట్ మ్యాచ్ రచ్చ షురూ కానుంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగుతున్న ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.
రెండోది, విమెన్స్ ఆసియా కప్ 2026 ఫైనల్స్ కూడా ఈ సండేనే. ఈ టోర్నీలో పాకిస్తాన్, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్‌ను గ్రూప్ స్టేజ్‌లో చిత్తు చేసి, సెమీస్‌లో బంగ్లాకు చుక్కలు చూపించిన మహిళల జట్టు ఇప్పుడు టైటిల్ పోరులో శ్రీలంకతో డీ కొట్టబోతోంది. ఇప్పటికే ఏడుసార్లు ఆసియా ఛాంపియన్‌గా భారత్ నిలిచేలా చేసిన మన లేడీ గ్యాంగ్.. ఇప్పుడు ఎనిమిదోసారి కప్పు కొట్టడమే టార్గెట్‌గా దుబాయ్‌లో రాత్రి 8 గంటలకు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టబోతోంది.
మూడోది, జూనియర్ ఆసియా కప్ మెన్స్ హాకీ ఫైనల్ ధమాకా కూడా ఈరోజే. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో మలేషియాను 3-1 తేడాతో రప్ఫాడించిన భారత్ కుర్రాళ్లు, ఈ సండే సాయంత్రం 4:15 గంటలకు సౌత్ కొరియాతో గోల్డ్ మెడల్ కోసం అమీతుమీ తేల్చుకోబోతున్నారు.

నాలుగోది, జూనియర్ ఆసియా కప్ విమెన్స్ హాకీ ఫైనల్ సేమ్ డేనే కావడం మరో విశేషం. శనివారం రోజు జరిగిన సెమీస్‌లో సౌత్ కొరియాను 5-1 తేడాతో చితకబాదిన ఇండియన్ టీమ్ .. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకే డ్రాగన్ కంట్రీ చైనాతో ఫైనల్ సమరానికి రెడీ అవుతోంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లలో అందరికంటే ముందు ఈ మ్యాచే ప్రారంభమవుతుంది.
మొత్తానికి ఇటు హాకీలో రెండు మ్యాచులకు రెండు కప్పులు, అటు క్రికెట్‌లో ఆసియా కప్‌తో పాటు టీ20 సిరీస్ బోణి కొట్టడానికి ఈరోజే ముహూర్తం పడింది. దీంతో ఇలా 4 మ్యాచ్‌లతో స్పోర్ట్స్ లవర్స్‌కి ఇది ఓ రేంజ్‌లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సండే అవబోతోంది.
𝙎𝙪𝙣𝙙𝙖𝙮 𝙠𝙖 𝙨𝙘𝙚𝙣𝙚 𝙨𝙤𝙧𝙩𝙚𝙙 𝙝𝙖𝙞, 𝙨𝙘𝙧𝙚𝙚𝙣 𝙨𝙚 𝙝𝙖𝙩𝙣𝙖 𝙢𝙖𝙣𝙖 𝙝𝙖𝙞! 🤩
Two mega clashes, one epic evening! From the #DPWorld WomensAsiaCup2026 Final to the 1st #AFGvIND T20I – get ready for back-to-back high-octane cricket action.
Tune in for the… pic.twitter.com/fTxGljI1JE
— Sony Sports Network (@SonySportsNetwk) September 12, 2026
‘FINAL’ BATTLE FOR ‘The Crown’! 👑🔥
The defending champions Indian Junior Men’s Team all set for South Korea in the AHF Junior Asia Cup 2026 final on September 13! 🏑🏆
Livestream Link: 👉 https://t.co/Et7N1LN3vx#HockeyIndia #IndiaKaGame #JuniorAsiaCup pic.twitter.com/wgbUx07X0s
— Hockey India (@TheHockeyIndia) September 12, 2026
INDIAN TEAM IS INTO THE FINALS! 🇮🇳🤩
India defeated South Korea 5-1 to storm into the final of the Asian Junior Hockey Cup!
Total dominating show by our Junior Girls! 🔥
GO FOR THE TITLE 🏆💪 pic.twitter.com/mRnAjVAYt1
— The Khel India (@TheKhelIndia) September 12, 2026
Emotional Availability : పార్ట్‌నర్స్ ఆలోచనలు కలిస్తే సరిపోదా? బంధంలో ఎమోషనల్ అవైలబిలిటీ అవసరమా?





