Just SportsLatest News

Suryakumar Yadav : సూర్యభాయ్ కు బై..బై..భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్

Suryakumar Yadav : టీ20 ప్రపంచకప్ ను గెలిచినా సరే సారథిగా మాత్రమే సూర్య సక్సెస్ అయ్యాడు. వ్యక్తిగతంగా విఫలమయ్యాడు

Suryakumar Yadav

అంతా అనుకున్నదే జరుగుతోంది. టీ20 ఫార్మాట్ కు సంబంధించి టీమిండియా కెప్టెన్సీ మార్పు ఖాయమైంది. త్వరలోనే భారత టీ20 జట్టుకు కొత్త సారథి రాబోతున్నాడు. గత రెండున్నరేళ్లుగా జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) పై వేటు వేసేందుకు బీసీసీఐ నిర్ణయించింది. వ్యక్తిగతంగా అతని వైఫల్యాలే దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

టీ20 ప్రపంచకప్ ను గెలిచినా సరే సారథిగా మాత్రమే సూర్య సక్సెస్ అయ్యాడు. వ్యక్తిగతంగా విఫలమయ్యాడు. కేవలం ఈ మెగా టోర్నీలోనే కాదు అంతకుముందు పలు సిరీస్ లలోనూ, ఇటీవల ఐపీఎల్ లోనూ సూర్యకుమార్ యాదవ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సూర్యకుమార్ నుంచి మిస్టర్ 360 తరహా ఆట చూసి దాదాపు ఏడాది పైనే అయిపోయింది. కనీసం 30 ప్లస్ స్కోర్లు కూడా చేయలేకపోతున్న స్కై తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు.

పైగా అతని వయసును కూడా దృష్టిలో ఉంచుకున్న సెలక్టర్లు వచ్చే మూడు నాలుగేళ్లకు జట్టును సమర్థవంతంగా నడిపించే నాయకుడి కోసం చూస్తున్నారు. నిజానికి టెస్ట్ , వన్డే కెప్టెన్ గా ఉన్న గిల్ గతంలో టీ20ల్లోనూ సారథిగా వ్యవహరించాడు. అయితే సెలక్టర్లు అనుకున్న రీతిలో మాత్రం మెప్పించలేదు. ఈ కారణంగానే బీసీసీఐ సూర్యకుమార్ వైపు మొగ్గుచూపింది. ఇప్పుడు సూర్యాభాయ్ కు వయసు కూడా మీద పడుతుండడం, నిలకడలేని ఫామ్ వంటి కారణాలతో కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది.

ప్రస్తుతం సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో ముగ్గురు ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. కొత్త కెప్టెన్ రేసులో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఉన్నారు. వీరిలో శ్రేయాస్ వైపే ఎక్కువమంది సెలక్టర్లు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. నిన్నటి వరకూ అసలు టీ ట్వంటీ జట్టులో చోటు కూడా లేని శ్రేయాస్ ఇప్పుడు ఏకంగా జట్టును నడిపించే అవకాశాన్ని దక్కించుకుంటే అద్భుతమే.

Suryakumar Yadav
Suryakumar Yadav

దీనికి కారణం ఐపీఎల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సీజన్లుగా ఏ జట్టులో ఉంటే ఆ జట్టును ఛాంపియన్ గానో లేదా రన్నరప్ గానో, కనీసం ప్లే ఆఫ్స్ కైనా చేర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. వ్యక్తిగతంగానూ రాణిస్తున్నాడు. కెప్టెన్సీ విషయంలో విమర్శకులను సైతం ఆకట్టుకున్నాడు.

అందుకే శ్రేయాస్ కే పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయి. అటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బీహార్ కు టైటిల్ అందించిన ఇషాన్ కిషన్ పైనా అంచనాలున్నాయి. ఇక తెలుగుతేజం తిలక్ వర్మ పేరును సైతం సెలక్టర్లు చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సూర్యకుమార్(Suryakumar Yadav) ను సారథ్య బాధ్యతల నుంచి తొలగించడం దాదాపుగా ఖాయమైపోయినట్టే.

Annamalai : తొందరపడొద్దు..అన్నామలైకి బీజేపీ బుజ్జగింపులు

Related Articles

Back to top button