T20 World Cup : కాయ్ రాజా కాయ్..వరల్డ్ కప్ ఫైనల్ పై జోరుగా బెట్టింగ్స్
T20 World Cup : క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే అభిమానులకే కాదు బుకీలకు, పందాల రాయుళ్లకు పండగే.. మన దేశంలో బెట్టింగ్ చట్టవ్యతిరేకం. దానిపై ప్రభుత్వాలు కఠినంగానే వ్యవహరిస్తున్నా ఎక్కడో ఒక చోట బుకీలు సిండికేట్ గా ఏర్పడి బెట్టింగ్ మార్కెట్ ను నడిపిస్తూనే ఉంటున్నాయి
T20 World Cup
క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే అభిమానులకే కాదు బుకీలకు, పందాల రాయుళ్లకు పండగే.. మన దేశంలో బెట్టింగ్ చట్టవ్యతిరేకం. దానిపై ప్రభుత్వాలు కఠినంగానే వ్యవహరిస్తున్నా ఎక్కడో ఒక చోట బుకీలు సిండికేట్ గా ఏర్పడి బెట్టింగ్ మార్కెట్ ను నడిపిస్తూనే ఉంటున్నాయి. డ్రీమ్ 11 లాంటి సంస్థనే మూయించిన ప్రభుత్వానికి బెట్టింగులను సమూలంగా నిర్మూలించడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ పై వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది.
ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ పై దానికి రెట్టింపు బెట్టింగ్ జరుగుతున్నట్టు అంచనా. దాదాపు 5 నుంచి 10 వేల కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు. సొంతగడ్డపై జరుగుతుండడంతో సహజంగానే భారత్ ఫేవరెట్. బుకీల వైపు నుంచి కూడా టీమిండియానే హాట్ ఫేవరెట్. ప్రస్తుతం బుకీలు లెక్కలు కట్టిన పందాల రేట్ల ప్రకారం భారత్ గెలుస్తుందని 1000 రూపాయలు పందెం వేస్తే 400 రూపాయలు వస్తాయి. అదే న్యూజిలాండ్ ఫైనల్ గెలుస్తుందని పందెం వేస్తే 1000 రూపాయలకు 2900 వస్తాయి.
ఈ టోర్నీ ఆరంభం నుంచీ సౌతాఫ్రికాతో మ్యాచ్ తప్పిస్తే మిగిలిన అన్ని మ్యాచ్ లలో భారత జట్టు గెలిచింది. బౌలింగ్ కాస్త కలవరపెడుతున్నా సంజూ శాంసన్ ఫామ్ లోకి రావడం, తిలక్ వర్మ, దూబే చివర్లో మెరుపులు మెరిపిస్తుండడం, బుమ్రా మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేస్తుండడంతో ఫైనల్లోనూ భారత్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ కారణంగానే బుకీలు టీమిండియానే హాట్ ఫేవరెట్ గా డిసైడ్ చేశారు. అయితే మ్యాచ్ ఫలితంపై పందెం వేస్తే తక్కువ మొత్తమే వస్తుండడంతో బ్యాటర్ల పెర్ఫార్మెన్స్ లపై ఎక్కువ బెట్టింగ్ నడుస్తోంది. సంజూ శాంసన్ సెంచరీ కొడతాడా ? , అభిషేక్ శర్మ ఫిఫ్టీ కొడతాడా ? సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడా ? , బౌలింగ్ లో ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు ? వంటి అంశాలకు డిమాండ్ ఉందని బుకీలు చెబుతున్నారు. అలాగే టాస్ , పవర్ ప్లేలో ఎన్ని పరుగులు చేస్తారు..
ఎన్ని వికెట్లు పడతాయి.. మొత్తం స్కోరు 180 ప్లస్ లేక 200 పైగా నమోదవుతుందా వంటి వాటిపై భారీగా పందాలు కాస్తున్నారు. మొత్తం మీద ఈ ఒక్క ఫైనల్ తో బుకీలు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు.

హెచ్చరిక ః బెట్టింగ్ చట్టరీత్యా నేరం మరియు కుటుంబాలను ఆర్థికంగా చీకట్లోకి నెడుతుంది.. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్లకండి





