Just SportsLatest News

Team India : ఒకే నెలలో 4 సిరీస్‌లతో టీమిండియా..సెప్టెంబర్ 13 నుంచి క్రికెట్ జాతర

Team India : మొన్నటికి మొన్న లంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో క్లీన్ సీప్ చేసిన టీమిండియా..సెప్టెంబర్ 13 నుంచి నాన్ స్టాప్ క్రికెట్ మ్యాచులతో అలరించడానికి రెడీ అయిపోతోంది.

Team India

ఇప్పటివరకు రెస్ట్ తీసుకున్న టీమిండియా ప్లేయర్లు.. ఇకపై అసలైన యాక్షన్ మోడ్‌లోకి ఎంటర్ అవబోతున్నారు. వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఒకే నెలలో ఏకంగా నాలుగు వేర్వేరు ఇంటర్నేషనల్ సిరీస్‌లలో పాల్గొని రికార్డు సృష్టించడానికి భారత జట్టు రెడీ అయింది.

మొన్నటికి మొన్న లంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..సెప్టెంబర్ 13 నుంచి నాన్ స్టాప్ క్రికెట్ మ్యాచులతో అలరించడానికి రెడీ అయిపోతోంది. మిగిలిన 17 రోజుల్లో భారత క్రికెట్ లవర్స్‌కి పిచ్చెక్కించే క్రేజీ షెడ్యూల్ బయటకు రావడంతో ఈ డిటైల్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు.

ఈ నాన్ స్టాప్ క్రికెట్ జాతర సెప్టెంబర్ 13న ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ప్రారంభం అవుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 13వ తేదీ, 15వ తేదీ, 17 వ తేదీలో ఈ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఇంటర్నేషనల్ సీజన్‌కి తిరుగులేని రీ-ఎంట్రీ ఇవ్వడానికి గంభీర్ సేన సిద్ధమవుతోంది.

దీని తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా అది కూడా జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌లో.. భారత టీమ్ తలపడనుంది. దీంతో జపాన్ క్రికెట్ హిస్టరీలోనే భారత్‌తో ఆడటం ఒక గోల్డెన్ మైలురాయిగా నిలిచిపోబోతోంది. దీని తర్వాత సెప్టెంబర్ 24 వ తేదీ నుంచి స్టార్ట్ కానున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల పోటీలలో మెన్స్ క్రికెట్ ఈవెంట్‌లో భాగంగా..టీమిండియా సెప్టెంబర్ 28వ తేదీన డైరెక్టుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌తో తన గోల్డ్ మెడల్ వేటను మొదలుపెట్టబోతోంది.

Team India
Team India

ఇటు ఆసియా క్రీడలు జరుగుతుండగానే, మరోవైపు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి బలమైన వెస్టిండీస్ జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20ల లాంగ్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. వెస్టిండీస్‌తో మొదటి 2 వన్డేలు సెప్టెంబర్ 27వ తేదీ, 30వ తేదీలో జరగనుండగా, మూడో వన్డే అక్టోబర్ 3న జరుగుతుంది. అది ముగిసిన వెంటనే పొట్టి ఫార్మాట్ టీ20 సిరీస్ మోత మోగబోతోంది.

మొత్తంగా సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్తాన్, జపాన్, ఆసియా గేమ్స్, విండీస్ సిరీస్‌లతో ఒకే నెలలో 4 వేర్వేరు ఇంటర్నేషనల్ ఛాలెంజెస్‌ను ఎదుర్కొంటూ టీమిండియా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. దీంతో క్రికెట్ లవర్స్‌కు ఈ సెప్టెంబర్ నెల అపరిమితమైన వినోదాన్ని అందించే పూనకాల జాతర వచ్చినట్లే అని చెప్పొచ్చు.

Gold Rates Down Fall : పడిపోయిన బంగారం ధరలు.. మరి వెండి పరిస్థితి ఏంటి?

Related Articles

Back to top button