Just BusinessLatest News

Gold Rates Down Fall : పడిపోయిన బంగారం ధరలు.. మరి వెండి పరిస్థితి ఏంటి?

Gold Rates Down Fall : డాలర్ వ్యాల్యూ పెరిగినప్పుడల్లా గ్లోబల్ ఇన్వెస్టర్లకు గోల్డ్ కొనుగోలు చేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.

Gold Rates Down Fall

బంగారం ధరలకు మరోసారి బ్రేకులు పడ్డాయి. ఈ నెల ప్రారంభం నుంచే రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన గోల్డ్ ధరలు .. అయితే గ్లోబల్ మార్కెట్‌లో చోటు చేసుకున్న మార్పులతో పుత్తడి ప్రియులకు పెద్ద ఊరట లభించింది. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) రిలీజ్ చేసిన లేటెస్ట్ వివరాల ప్రకారం.. ఈ వీక్‌లో 24 క్యారెట్ల పసిడి ధరపై ఏకంగా రూ. 1860 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ కాస్ట్ రూ. 1లక్ష54వేల800 వద్ద ట్రేడవుతోంది.

ఇక జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, 10 గ్రాములపై రూ. 1700 వరకు తగ్గి, ప్రస్తుతం రూ.1లక్ష41వేల900 కు చేరింది. అలాగే 18 క్యారెట్ల బంగారం పై కూడా రూ. 1390 తగ్గి, ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1లక్ష16వేల100 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1 లక్ష54,800 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1లక్ష41వేల900 వద్ద కొనసాగుతోంది. సాధారణంగా ఈ ధరలను IBJA ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు అప్‌డేట్ చేస్తూ ఉంటుంది.

బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చినా, వెండి రేట్లలో మాత్రం ఎలాంటి పెద్ద మార్పు కనిపించలేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ ధర రూ.2లక్షల50వేల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌లో బంగారం ధరలు తీవ్ర ఊగిసలాటకు గురవుతున్నా, సిల్వర్ మాత్రం స్థిరంగానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే పసిడి ధర ఔన్సుకు దాదాపు 4,500 డాలర్లుగా ఉంటే, వెండి ధర ఔన్సుకు 66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Gold Rates Down Fall
Gold Rates Down Fall

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో పాటు మధ్యప్రాచ్యంలోని యూఎస్ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేయడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ సీన్ మారిపోయింది. ఈ ఉద్రిక్తతల వల్ల అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలపడటంతో పాటు యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్, బాండ్ల రెవిన్యూ, ముడి చమురు కాస్ట్ కూడా ఒక్కసారిగా పుంజుకున్నాయి.

డాలర్ వ్యాల్యూ పెరిగినప్పుడల్లా గ్లోబల్ ఇన్వెస్టర్లకు గోల్డ్ కొనుగోలు చేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. దీనివల్ల గ్లోబల్ లెవెల్‌లో బంగారానికి డిమాండ్ తగ్గి, సేల్స్ పడిపోతాయి. దీంతో పసిడి ధరలు కిందికి దిగిరాక తప్పలేదు.

Teachers Day : గురుభ్యోన్నమః

Related Articles

Back to top button