Just SportsLatest News

India : ఒక్క ఓటమితో సీన్ రివర్స్..భారత్ కు సెమీస్ ఛాన్స్ ఉందా ?

India : ఒక్క మ్యాచ్ ఓడినా సెమీస్ ఆశలు గల్లంతయ్యే పరిస్థితి. ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి భారత సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చేసింది

India

మహిళల టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే సెమీస్ చేరతాయి. దీంతో రేస్ ఆసక్తికరంగా మారింది. ఒక్క మ్యాచ్ ఓడినా సెమీస్ ఆశలు గల్లంతయ్యే పరిస్థితి. ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది.

దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి భారత సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చేసింది.  పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై వరుస విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో బోల్తా పడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్(India) సఫారీలకు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్ మరిజాన్ కాప్ 81 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లను వదిలేయడం భారత మహిళల ఓటమికి కారణమైంది. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం ఒక్క ఓటమి టోర్నీలో జట్టు ఫ్యూచర్ ను ప్రభావితం చేస్తుండడంతో భారత్(India) ఇప్పుడు సెమీస్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.

గ్రూప్-1 పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఆ జట్టు ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచి 6 పాయింట్లతో ఉంది. భారత జట్టు 3 మ్యాచుల్లో 2 విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి.

India
India

నెట్ రన్ రేట్ పరంగా దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలో ఉండగా.. పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు వరుసగా 3 మ్యాచుల్లో ఓడిపోయి ఇంటి దారి పట్టాయి. భారత జట్టు తన తర్వాతి మ్యాచులను బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో ఆడాల్సి ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైతే.. గరిష్టంగా 6 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

అదే సమయంలో దక్షిణాఫ్రికా తన తదుపరి రెండు మ్యాచ్‌లను బలహీనమైన బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ దక్షిణాఫ్రికా జట్టు గెలిస్తే 8 పాయింట్లతో ఈజీగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. దీంతో భారత్ గ్రూప్ దశ నుంచే ఇంటిబాట పట్టే అవకాశం ఉంది.ఒకవేళ ఆస్ట్రేలియా పాకిస్తాన్, భారత్(India) చేతిలో ఓడిపోతే మళ్లీ ఈక్వేషన్ మారే అవకాశం ఉంది.

Mahabharatham : మహాభారతం ఓ సైకాలజీ గ్రంథం..వ్యాస మహర్షి చెప్పిన మైండ్ గేమ్స్ ఎలా ఉపయోగపడతాయి..

Related Articles

Back to top button