Just SportsLatest News

Women’s T20 : భారత్ కు సఫారీ సవాల్..మహిళల టీ20 ప్రపంచకప్

Women's T20 : దక్షిణాఫ్రికా జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. మెగా టోర్నీల్లో సఫారీలను చాలా ప్రమాదకరమైన ప్రత్యర్థులుగా చెప్పొచ్చు.

Women’s T20

ఇంగ్లీష్ గడ్డపై జరుగుతున్న మహిళల టీ20(Women’s T20) ప్రపంచకప్ లో భారత జట్టు అసలు సిసలు సవాల్ కు సిద్ధమైంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న భారత్ ఆదివారం సౌతాఫ్రికా మహిళలతో తలపడబోతోంది. మాంచెస్టర్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ సమఉజ్జీల సమరంగా చెప్పొచ్చు.

ప్రస్తుతం రెండు విజయాలతో గ్రూపులో అగ్రస్థానంలో ఉన్న భారత మహిళల జట్టుకు సఫారీ జట్టు గట్టిపోటీనివ్వడం ఖాయం. పాక్ పై 64 రన్స్ తేడాతో, నెదర్లాండ్స్ పై 95 రన్స్ తేడాతో గెలిచిన భారత్ జట్టులో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, రిచా ఘోష్ ఫామ్ లో ఉన్నారు. బ్యాటింగ్ లో ఈ ముగ్గురూ చెలరేగితే భారీస్కోరు ఖాయం.

ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ విజయం టాపార్డర్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. అటు బౌలింగ్ లో దీప్తి శర్మ అదరగొడుతోంది. తన స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతోంది. దీప్తికి తోడుగా శ్రీచరణి కూడా అద్భుతంగా రాణిస్తోంది. వీరిద్దరూ బౌలింగ్ లో భారత్ కు మ్యాచ్ విన్నర్లు.

ఇదిలా ఉంటే శ్రేయాంక గాయంతో దూరమవడం ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఆమె స్థానంలో ప్రేమా రావత్ ను తీసుకున్నారు. తుది జట్టులోకి రాధా యాదవ్ ను తీసుకుంటారని భావిస్తున్నారు. మాంచెస్టర్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో స్పిన్నర్లే కీలకం కాబోతున్నారు.

మరోవైపు దక్షిణాఫ్రికా జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. మెగా టోర్నీల్లో సఫారీలను చాలా ప్రమాదకరమైన ప్రత్యర్థులుగా చెప్పొచ్చు. తొలి మ్యాచ్ లో ఆసీస్ పై ఓడినా తర్వాత పాక్ పై గెలుపుతో బోణీ కొట్టింది. సౌతాఫ్రికా జట్టులో కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అతిపెద్ద బలం. అలాగే లూస్, డిక్లార్క్ , మరిజన్నే కాప్ కీ ప్లేయర్స్ గా ఉన్నారు.

Women's T20
Women’s T20

సఫారీ బౌలింగ్‌లో కూడా రాణిస్తోంది. భారత బ్యాటర్లు వారి బౌలింగ్ పై ఎటాకింగ్ కు దిగకుంటే మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సుంది. అయితే సౌతాఫ్రికాతో పోలిస్తే సమిష్టిగా రాణిస్తుండడం భారత మహిళల జట్టుకు కలిసొచ్చే అంశం. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా కలిసికట్టుగా రాణిస్తే హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవచ్చు.

టైటిల్ ఫేవరెట్స్ లో ఒకటిగా ఉన్న భారత్ కు సఫారీలపై గెలుపు చాలా కీలకం. ఇక గత రికార్డుల్లో మాత్రం ఇరు జట్లు దాదాపుగా సమానం. 24 మ్యాచ్ లలో తలపడితే భారత్ 11 సార్లు, సౌతాఫ్రికా 10 సార్లు గెలిచాయి. మూడు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు.

Living Relationship : సహజీవనం అత్యాచారం కేసు ఎలా అవుతుంది ?..అలహాబాద్ హైకోర్టు చీవాట్లు

Related Articles

Back to top button