Bank Accounts:ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే లాభమా? నష్టమా? ఆర్బీఐ ఏమంటుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?
Bank Accounts: అసలు ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలి ? చట్టం ఏమని చెబుతోంది ? ఎక్కువ అకౌంట్లు ఉండటం వల్ల ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలపై చాలామందికి రకరకాల అనుమానాలుంటాయి.
Bank Accounts
ఈ డిజిటల్ యుగంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఎవరికి అయినా నిమిషాల పనిగా మారిపోయింది. జీతం కోసమో, ఇన్వెస్ట్‌మెంట్‌ల కోసమో లేదా రకరకాల ఆఫర్ల కోసమో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్ల(Bank Accounts)ను తెరుస్తుంటారు. అయితే, అసలు ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలి ? చట్టం ఏమని చెబుతోంది ? ఎక్కువ అకౌంట్లు ఉండటం వల్ల ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలపై చాలామందికి రకరకాల అనుమానాలుంటాయి.
అయితే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం చూస్తే మాత్రం.. ఒక వ్యక్తి ఇన్ని అకౌంట్లు మాత్రమే ఉంచుకోవాలనే నిర్దిష్టమైన లిమిట్ ఏదీ లేదు. మీ అవసరానికి తగ్గట్టుగా ఎన్ని బ్యాంకులను అయినా ఎంచుకోవచ్చు. ఆ సమయంలో అంటే మీరు కొత్తగా అకౌంట్ తెరిచేటప్పుడు బ్యాంకులు మీ కేవైసీ (KYC) వివరాలతో పాటు, ఆ అకౌంట్ తెరవడానికి గల కారణంతో పాటు మీ ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తాయి. ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్ వంటి వాటిని అరికట్టడమే దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం.
ప్రస్తుతం చాలా ప్రైవేట్ బ్యాంకుల్లో నెలకు సగటున రూ. 10,000 నుంచి రూ. 25,000 వరకు మినిమం బ్యాలెన్స్ (Minimum Balance) ఉంచాలనే కండిషన్ ఉంది. మీకు 4-5 అకౌంట్లు ఉన్నాయనుకుంటే, కేవలం ఈ కండిషన్ వల్ల మీ దగ్గర ఉన్న లక్ష రూపాయల కంటే ఎక్కువ నగదు బ్యాంకుల్లోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఈ మొత్తంపై వచ్చే వడ్డీ చాలా తక్కువ. అదే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెడితే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాలెన్స్ తగ్గితే బ్యాంకులు భారీగా పెనాల్టీలు విధిస్తాయి.
ప్రతి అకౌంట్‌కు యాన్యువల్ మెయింట్‌నెన్స్ ఛార్జెస్ (AMC), డెబిట్ కార్డ్ ఛార్జీలు, ఎస్సెమ్మెస్ అలర్ట్ ఫీజులు ,చెక్ బుక్ ఛార్జీలు వంటివి ఉంటాయి. ఏటీఎం కార్డు కోసం ఏడాదికి రూ. 200 నుంచి రూ. 500 వరకు వసూలు చేస్తారు. అకౌంట్లు ఎక్కువైన కొద్దీ, మీరు ఉపయోగించకపోయినా ఈ సేవా రుసుముల రూపంలో ఏటా వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది.
ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు వాటన్నింటి ట్రాన్జాక్షన్స్‌ను ట్రాక్ చేయడం కష్టమవుతుంది. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా వినియోగంలో లేని (Dormant) అకౌంట్లను లక్ష్యంగా చేసుకుంటారు. ఒకవేళ మీ అకౌంట్‌లో ఏదైనా అనుమానాస్పద ట్రాన్జాక్షన్ జరిగినా, మీరు రెగ్యులర్‌గా చెక్ చేయకపోతే ఆ విషయం వెంటనే తెలియకుండా పోతుంది. ఇది సేఫ్టీ పరంగా పెద్ద రిస్క్ అవుతుంది.
అంతేకాదు ప్రతి అకౌంట్‌కు వేర్వేరు నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లతో పాటు యూపీఐ పిన్‌లు గుర్తుంచుకోవడం చాలా పెద్ద తలనొప్పి. సేఫ్టీ కోసం వేర్వేరుగా పెట్టుకోవాలి. కానీ గుర్తుండవనే భయంతో చాలామంది ఒకే పాస్వర్డ్‌లు కానీ, సులభమైన పాస్‌వర్డ్‌లు కానీ పెడతారు. ఇది హ్యాకర్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

మీరు ఏదైనా అకౌంట్‌ను పట్టించుకోకుండా వదిలేస్తే, మినిమం బ్యాలెన్స్ లేనందుకు పడే జరిమానాల వల్ల ఆ అకౌంట్(Bank Accounts) నెగిటివ్ బ్యాలెన్స్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి చిన్న పొరపాట్లు కూడా మీ క్రెడిట్ హిస్టరీని, సిబిల్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. ఫ్యూచర్‌లో మీరు ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది.
ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనుకునే వారికి ఒకటి , రెండు బ్యాంక్ అకౌంట్లు(Bank Accounts) ఉంటే సరిపోతుంది. ఒకటి మీ శాలరీ లేదా మెయిన్ ఇన్కమ్ కోసం, మరొకటి సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ల కోసం కేటాయించుకోవచ్చు. అనవసరమైన బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేయడం వల్ల ఎక్స్‌ట్రా ఛార్జ్‌ల భారం తగ్గడమే కాకుండా, మీ ఆర్థిక స్థితిపై మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది.
Impatience:క్షణకాలపు ఆవేశం జీవిత కాలపు బంధాలను దూరం చేస్తుందా? అసహనాన్ని అదుపు చేసుకోలేమా?





