Just TelanganaJust PoliticalLatest News

Bandi Bhagirath : బండి భగీరథ కోసం గాలింపు..పలు చోట్ల పోలీసుల తనిఖీలు

Bandi Bhagirath : బండి బగీరథ్‌ అరెస్ట్ అవ్వకుండా అడ్డుకోవాలన్న పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేయడంతో.. ఇప్పుడు పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. అందువల్ల ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వొచ్చు.

Bandi Bhagirath

తెలంగాణలో సంచలనంగా మారిన బండి భగీరథ(Bandi Bhagirath)పై పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న బండి భగీరథ ముందస్తు బెయిల్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్నది. బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

అరెస్ట్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని భగీరథ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోరగా న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. తర్వాతి విచారణలో బెయిల్ పై తుది తీర్పు వెలువరిస్తామని పేర్కొంది. దీంతో కోర్టులో భగీరథకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

ఈ నేపథ్యంలో లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం భగీరథ(Bandi Bhagirath) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు ఆలస్యం చేయడం తీవ్ర దుమారం రేపింది. దీంతో సీఏం రేవంత్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, తర్వాత సిట్ వేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

సిట్ బృందం బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసిన తర్వాత పోక్సో కేసులో మరికొన్ని సెక్షన్లు నమోదు చేశారు. అయితే బాధితురాలి వయసు విషయంలో భగీరథ తరపు న్యాయవాది కొన్ని అభ్యంతరాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో మైనరా కాదా అన్న విషయాన్ని ధృవీకరించాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

Bandi Bhagirath
Bandi Bhagirath

మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు కాకపోవడంతో భగీరథ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు నమోదైనప్పటి నుంచీ భగీరథ పరారీలో ఉన్నాడు. అతని నివాసంలోనూ, సన్నిహితులు, కుటుంబసభ్యులు, స్నేహితుల ఇళ్లల్లో విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు, బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్దేశపూర్వకంగానే భగీరథను అరెస్ట్ చేయకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చిన్న చిన్న ఘటనల్లోనే నిందితులను చాకచక్యంగా పట్టుకుంటారని పేరున్న తెలంగాణ పోలీసులు భగీరథను ఇన్ని రోజులైనా పట్టుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం బండి నివాసంలోనూ, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు ఎట్టిపరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ లోపే బండి భగీరథ హైదరాబాద్ సీపీ ముందు లొంగిపోతాడన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Bermuda Triangle : బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం .. దశాబ్దాల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు

Related Articles

Back to top button