Just TelanganaJust PoliticalLatest News

CM Revanth Reddy : సీఎంతో మహేశ్ బాబు, అనన్య బిర్లా భేటీ.. ఆ వెంటనే ఢిల్లీకి రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హీరో మహేశ్ బాబు, పారిశ్రామికవేత్త అనన్య బిర్లా భేటీ అయ్యారు. తర్వాత ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్‌పై మీడియా సమావేశంలో మాట్లాడతారు.

CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు శనివారం మర్యాదపూర్వకంగా సమావేశమయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల వికాస కేంద్రం (MCR HRD)లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహేశ్ బాబు బొకే అందించగా, ముఖ్యమంత్రి మహేశ్‌ను శాలువాతో సత్కరించి ఆప్యాయంగా పలకరించారు. తర్వాత ఇద్దరి మధ్య కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. అయితే వీరిద్దరి మధ్య ఏఏ విషయాలపైన చర్చ జరిగిందనే అంశం బయటకు రావకపోవడంతో.. ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది.

అదేవిధంగా, ఇండిపెండెంట్ మైక్రోఫిన్ చైర్‌పర్సన్, యువ పారిశ్రామికవేత్త అనన్య బిర్లా కూడా ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అనన్య బిర్లా తెలిపారు. అలాగే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆమె ఆసక్తి కనబరచడంతో, డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోతున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెను ఆహ్వానించారు.

మరోవైపు, శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో ఏర్పాటు చేయనున్న విలేకరుల భేటీలో ఆయన మాట్లాడనున్నారు. కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో తీసుకురాబోతున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి తరఫున తమ వాదనను గట్టిగా వినిపించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ వల్ల కలిగే నష్టాలను మీడియా వేదికగా రేవంత్ రెడ్డి వివరించడంతో పాటు, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన కూడా కాంగ్రెస్ ఎంపీలకు తెలంగాణ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.దీనికోసం ఇప్పటికే ఎంపీలందరూ తప్పనిసరిగా ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని సూచించారు.

 

Exercises In Old Age : ఏజ్ పెరిగేకొద్దీ ఎక్సర్‌సైజులు చేయడం మంచిదేనా? ..వ్యాయామాల వల్ల మజిల్స్ లూజ్ అవుతాయా? స్ట్రాంగ్ అవుతాయా?

Related Articles

Back to top button