Just TelanganaLatest News

Donald Trump Avenue : డొనాల్డ్ ట్రంప్ అవెన్యూపై అమెరికా అధ్యక్షుడి రియాక్షన్ ..హైదరాబాద్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లినట్లేనా?

Donald Trump Avenue : అమెరికా అధ్యక్షుడికి హైదరాబాద్‌లో గౌరవం దక్కడం వల్ల, అక్కడి పెద్ద పెద్ద కంపెనీలు భాగ్య నగరంలో తమ గ్లోబల్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఇంకా ఇంట్రస్ట్ చూపిస్తాయి.

Donald Trump Avenue

భారత ఐటీ హబ్‌గా దూసుకుపోతున్న హైదరాబాద్ పేరు మరోసారి ఇంటర్నేషనల్ న్యూస్‌లోనూ మారుమోగిపోతోంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ గవర్నమెంట్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

హైదరాబాద్‌లోని ఒక ప్రధానమైన రోడ్డుకు అమెరికా అధ్యక్షుడి పేరు పెట్టడమే దీనికి కారణం. దీనిపై రియాక్టయిన ట్రంప్ .. విదేశాల్లో ఒక అమెరికా ప్రెసిడెంట్‌కు ..ఇలాంటి అత్యున్నత గౌరవం దక్కడం ఇదే ఫస్ట్ టైమ్ అంటూ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో
రాసుకొచ్చారు.

ఐటీ కారిడార్‌గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో కొత్తగా కట్టిన అమెరికన్ కాన్సులేట్ అంటే యూఎస్ ఎంబసీ పక్కనే డొనాల్డ్ ట్రంప్ రోడ్డు ఉంది. అంతకు ముందు వరకూ దీనిని కేవలం యూఎస్ కాన్సులేట్ రోడ్డు అని మాత్రమే పిలిచేవారు. అయితే, అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ రోడ్డుకు అఫీషియల్‌గా డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ(Donald Trump Avenue )గా తెలంగాణ గవర్నమెంట్ నామకరణం చేసింది.

అమెరికా రాయబారి సెర్గియో గోర్, యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సరికొత్త శిలాఫలకాన్ని గ్రాండ్‌గా ఆవిష్కరించారు.

అసలు ఈ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడానికి గల బలమైన కారణం.. అమెరికా ,భారత్ మధ్య ముఖ్యంగా తెలంగాణకి యునైటెడ్ స్టేట్స్‌కు మధ్య ఉన్న బంధాన్ని మరింత స్ట్రాంగ్‌గా చేయడమే. ఈ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ(Donald Trump Avenue )ఉన్న ఏరియాలోనే వరల్డ్ ఫేమస్ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి సంస్థల రీసెర్చ్ సెంటర్లు, పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి.

హైదరాబాద్ గ్లోబల్ లెవెల్‌లో టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా రంగాలలో అమెరికాకు ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోంది. ఈ వ్యూహాత్మక సెంటిమెంట్‌ను గౌరవిస్తూ, అమెరికా అధ్యక్షుడిపై ఉన్న గౌరవానికి ప్రతీకగా తెలంగాణ గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

మరి దీనివల్ల తెలంగాణ ప్రజలకు కలిగే లాభాలు ఏంటనే కోణంలో చూస్తే.. ఇది కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదు, భారీ ఆర్థిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అమెరికా రాయబారి అఫీషియల్‌గా ప్రకటించినట్లు.. ఈ సరికొత్త సంబంధాల ద్వారా రానున్న రోజుల్లో దాదాపు 20 బిలియన్ డాలర్లు అంటే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

దీనిలో సింహభాగం హైదరాబాద్‌కే వచ్చే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడికి హైదరాబాద్‌లో ఇలాంటి గౌరవం దక్కడం వల్ల, అక్కడి పెద్ద పెద్ద కంపెనీలు భాగ్య నగరంలో తమ గ్లోబల్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఇంకా ఇంట్రస్ట్ చూపిస్తాయి. దీనివల్ల స్థానిక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, యువతకు వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయి.

Donald Trump Avenue
Donald Trump Avenue

అలాగే హైదరాబాద్‌లో ఇప్పుడున్న అమెరికన్ కాన్సులేట్ ఆసియాలోనే అతిపెద్దది కావడంతో.. రెండు దేశాల మధ్య దౌత్య బంధం మరింత పెరుగుతుంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు, ఉద్యోగులకు యూఎస్ వీసా ఇంటర్వ్యూలు , వీసా జారీ ప్రక్రియ మరింత ఈజీ అయ్యే అవకాశం ఉంది.

మొత్తంగా అమెరికా దేశాధినేత హైదరాబాద్ సిటీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ థాంక్స్ చెప్పడమనేది ప్రపంచ పటంలో నగర ఇమేజ్‌ను మరో రేంజ్‌కు తీసుకువెళ్లినట్లే అయింది. రాజకీయంగా దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నా, దీర్ఘకాలికంగా చూస్తే తెలంగాణ ఆర్థిక ప్రగతికి, ఉపాధికి ఈ అంతర్జాతీయ స్నేహం ఎంతగానో ఉపయోగపడనున్నట్లే తెలుస్తుంది.

Negative Energy : నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి?.. దిష్టి తీయడం వెనుక ఉన్న రహస్యం తెలుసా?

Related Articles

Back to top button