Just TelanganaJust Andhra PradeshLatest News

Hyderabad-Vijayawada Seaplane : హుస్సేన్‌సాగర్ టు ప్రకాశం బ్యారేజీ..వారెవ్వా అనేలా సీ-ప్లేన్ ప్రాజెక్ట్

Hyderabad-Vijayawada Seaplane : హైదరాబాద్‌లోని పరిశీలనలు దాదాపు ముగియడంతో.. త్వరలోనే విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం స్పాట్ సర్వే నిర్వహించబోతోంది.

Hyderabad-Vijayawada Seaplane

హైదరాబాద్ వాసులకు, ఏపీ టూరిజం లవర్స్‌కి ఒక సూపర్ గుడ్ న్యూస్ రాబోతోంది. ఇప్పటివరకు విమానం ఎక్కాలంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి రన్‌వే మీద వెళ్లే ప్లైట్‌నే చూశాం. కానీ నీటిపై తేలుతూ, అల్లల మీద నుంచే ఆకాశంలోకి దూసుకెళ్లే సీ-ప్లేన్ ఫీల్‌ని తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతం చేసుకునే రోజులు దగ్గరలోకి రాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు, పర్యాటక రంగానికి సరికొత్త గ్లామర్ తేవడానికి రేవంత్ సర్కార్ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్‌ను లైన్‌లోకి తెచ్చింది.

భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ నుంచి ప్లేన్ టేకాఫ్ అయి.. ఆకాశంలోంచి గ్రేటర్ సిటీ సోయగాలు, బుద్ధ విగ్రహం, సెక్రటేరియట్‌తో పాటు నగర అందాలను వీక్షిస్తూ.. కృష్ణా నది తీరపు సోయగాల మధ్య విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వాటర్‌పై ల్యాండ్ అయ్యేలా(Hyderabad-Vijayawada Seaplane) ఒక థ్రిల్లింగ్ టూరిజం సర్క్యూట్‌ను డిజైన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టును వీలైనంత వేగంగా ట్రాక్‌లోకి తీసుకురావడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్టుగా రంగంలోకి దిగారు. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో రేవంత్ రెడ్డి జరిపిన చర్చల తర్వాత ఈ ప్రతిపాదనలకు మరింత స్పీడ్ పెరిగింది.

ఈ ప్రాజెక్ట్ ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చెక్ చేయడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) టీమ్ ఇప్పటికే సిటీలోకి ఎంటర్ అయి క్షేత్రస్థాయి పరిశీలనను కూడా సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసింది. ప్రస్తుతం వాటర్‌పై సేఫ్‌గా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా హుస్సేన్‌సాగర్‌లో కరెక్టు పాయింట్లను మార్క్ చేసే పనిలో ఆఫీసర్లు బిజీగా ఉన్నారు.

హైదరాబాద్‌లోని పరిశీలనలు దాదాపు ముగియడంతో.. త్వరలోనే విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం స్పాట్ సర్వే నిర్వహించబోతోంది. ఆ తర్వాత ఏపీ , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్‌ను ఈ టీమ్ సబ్మిట్ చేస్తుంది.

Hyderabad-Vijayawada Seaplane
Hyderabad-Vijayawada Seaplane

ఈ సీ-ప్లేన్ల ల్యాండింగ్ లేదా టేకాఫ్ కోసం పెద్ద పెద్ద రన్‌వేలు, ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్ ఏమాత్రం అవసరం లేదు. కేవలం వాటర్ రీసోర్సెస్ ఉంటే చాలు. ఒక ట్రిప్‌లో 9 నుంచి 12 మంది ప్రయాణికులు దీనిలో జర్నీ చేయొచ్చు.

తెలంగాణ టూరిజం రోడ్‌మ్యాప్ 2025లో ఈ సీ-ప్లేన్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్‌ అయిన భాగం. గతంలో కూడా ఇలాంటి ఆలోచనలు వచ్చినా కూడా..రేవంత్ ప్రభుత్వం దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టి రియాలిటీలోకి తీసుకురావడానికి అడుగులు వేస్తోంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణం ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లా మారడం గ్యారంటీ.

Jowar Laddu : స్నాక్స్‌కి బిస్కెట్లు వద్దు.. జొన్న డ్రై ఫ్రూట్స్ లడ్డుతో ఫుల్ ఎనర్జీ

Related Articles

Back to top button