Janasena : తెలంగాణలో జనసేన ఇక యాక్టివ్..19న పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం
Janasena : అవసరమైతే తెలంగాణలో ప్రచారానికి తాను స్వయంగా తిరుగుతానంటూ పవన్ ప్రకటించడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.
Janasena
ఏపీలో కూటమిలో కీలక భాగస్వామిగా అధికారం పంచుకున్న జనసేన పార్టీ ఇక తెలంగాణపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టినందుకో లేక ఆ మధ్య ప్రొ.నాగేశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యల ఫలితమో తెలీదు కానీ తెలంగాణలో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించింది.
పవన్ కళ్యాణ్ ఏదో ఆవేశంలో ప్రకటన చేసారే తప్ప ఆచరణలో ఏం ఉండకపోవచ్చని పలువురు తెలంగాణ వాదులు అభిప్రాయపడ్డారు. అసలు పవన్ అవసరం తెలంగాణలో లేదంటూ మాట్లాడారు. అయితే పవన్ మాత్రం తెలంగాణలో పార్టీ విస్తరణపై చాలా సీరియస్ గా ఉన్నట్టు తేలిపోయింది.
తాజాగా పార్టీ కొత్త కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. జూన్ 19న మణికొండలో పార్టీ నూతన కార్యాలయాన్ని పవన్ ప్రారంభించబోతున్నారు. ఉదయం 11.08 గంటలకు ఈ ప్రారంభోత్సవం జరగనుంది. పార్టీ విస్తరణకు ఇది కీలక అడుగుగా చెప్పొచ్చు. పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పార్టీ పిలుపునిచ్చింది.
తెలంగాణలో జనసేన(Janasena) పార్టీ కార్యకలాపాల కొత్త కేంద్రంగా ఈ నూతన కార్యాలయం ఉండబోవటంతో పాటు, పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై మరింత ఫోకస్ పెట్టనున్నారు.
అవసరమైతే తెలంగాణలో ప్రచారానికి తాను స్వయంగా తిరుగుతానంటూ పవన్ ప్రకటించడం ఇక్కడ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉన్నా సరే, తెలంగాణలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా నిలవడం, వారిని క్రియాశీలం చేయడం పవన్ ముఖ్యమైన వ్యూహంగా కనిపిస్తోంది.
ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉన్న నాయకులకు అండగా నిలవడం తన బాధ్యతగా పవన్ భావిస్తున్నారు. దీనికోసం పార్టీ నిర్మాణంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఇబ్బంది కలగకుండా, ఎన్డీఏ కూటమి బలోపేతానికి జనసేన మద్దతుగా నిలుస్తున్నట్టు పలువురు అంచనా వేస్తున్నారు.

పనిలో పనిగా సంస్థాగతంగా జనసేన(Janasena) పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. దీని కోసం మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపబోతోంది. భవిష్యత్తులో జరిగే పెద్ద ఎన్నికలకు ఇది ఒక పునాదిగా ఉపయోగపడుతుందని పవన్ భావిస్తున్నారు.
అదే సమయంలో తెలంగాణకు తాను వ్యతిరేకం కాదనీ, ఇక్కడ కూడా తనకు తిరిగే హక్కు ఉందనీ, రాష్ట్ర అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్టు క్లారిటీ ఇవ్వడం ద్వారా పవన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
Collagen : బ్యూటీ ప్రపంచంలో కొల్లాజెన్.. అసలు ఇది బాడీకి ఎందుకంత ఇంపార్టెంట్?





