Just TelanganaJust PoliticalLatest News

Konda Murali : తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్ కలకలం..సుస్మిత వ్యాఖ్యలపై తండ్రి సమర్థన దేనికి దారి తీస్తుంది..

Konda Murali : తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను కొండా మురళి బహిరంగంగా సమర్థించడమే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

Konda Murali

తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్‌ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఢిల్లీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే సస్పెన్స్ నడుస్తున్న సమయంలో.. గాంధీ భవన్ నుంచి ప్రజాభవన్‌ వరకు వరుస రాజకీయ పరిణామాలు ఉత్కంఠను పెంచుతున్నాయి.

ఒకవైపు కొండా సురేఖ, చిన్నారెడ్డితో పాటు కొంతమంది పార్టీ నాయకుల తీరుపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్‌ను రెడీ చేసి చర్యలకు సిగ్నల్ ఇవ్వబోతుంటే, మరోవైపు ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండా మురళి(Konda Murali), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ భేటీ తర్వాత కొండా మురళి చేసిన కామెంట్లు ఇప్పుడు పాలిటిక్స్‌లో మరింత కాక పుట్టిస్తున్నాయి.

తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను కొండా మురళి బహిరంగంగా సమర్థించడమే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ తర్వాత మీడియా ముందు మాట్లాడిన మురళి.. ఈ సమావేశం కేవలం ఒక బిల్లు విషయమై మాత్రమే చర్చించడానికే జరిగిందని, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ గురించి గానీ లేదా సుస్మిత వ్యాఖ్యల గురించి గానీ చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు.

తమ కుమార్తె సుస్మిత వయస్సు 38 ఏళ్లని, ఆమెకు 15 ఏళ్ల వరల్డ్ ఛాంపియన్ కొడుకు కూడా ఉన్నాడని చెబుతూ.. ఆమెకు నచ్చినట్లు ఉండటానికి, స్వతంత్రంగా మాట్లాడటానికి ఆమెకు పూర్తి హక్కు ఉందని స్పష్టం చేశారు. సుస్మిత కామెంట్లు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, ఆమెను ప్రశ్నించే హక్కు తమకు కూడా లేదని వ్యాఖ్యానించారు.

ఇంత జరుగుతున్నా తమ ఫ్యామిలీకి గాంధీ కుటుంబంపై సంపూర్ణ విశ్వాసం ఉందని, తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని మురళి మరోసారి చెప్పారు. సురేఖ అందుబాటులో లేరనే వార్తలను ఖండించిన మురళి.. ఆమె ప్రస్తుతం వరంగల్‌ పర్యటనలో ఉన్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలను గుప్పించిన ఆయన.. బీఆర్‌ఎస్ నుంచి గతంలో కవిత బయటకు వచ్చి మాట్లాడలేదా, దాని గురించి అప్పుడూ, ఇప్పుడూ ఎవరూ మాట్లాడకుండా తమ విషయంలోనే ఎందుకింత రచ్చ చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా తండ్రిగా తన కుమార్తె అభిప్రాయాన్ని, ఆమె స్వేచ్ఛను వెనకేసుకొస్తూ కొండా మురళి మాట్లాడిన మాటలు, మొన్న సురేఖ చేసిన కామెంట్లకు సరిగ్గా సరిపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం దీనిని ఎలా తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Konda Murali
Konda Murali

కాంగ్రెస్ హైకమాండ్ ఒకవైపు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోడానికి రెడీ అవుతున్న టైమ్‌లో, కొండా మురళి చేసిన ఈ కామెంట్స్ పార్టీ క్రమశిక్షణకు నిజంగానే సవాల్‌గా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్టానం హెచ్చరిస్తున్నా సరే, తమ సొంత స్టాండ్ పైనే కొండా ఫ్యామిలీ నిలబడటమనేది తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలను మరోసారి బయటపెట్టినట్లు అయింది. అయితే ఇప్పుడు హైకమాండ్ కఠిన చర్యలకు దిగితే కొండా వర్గం రియాక్షన్ ఎలా ఉంటుంది? లేదంటే వారిని బుజ్జగించే ప్రయత్నం జరుగుతుందా అనేది కొద్ది గంటల్లో తేలబోతోంది.

Blood Moon : ఆగస్టు 27 అర్ధరాత్రి బ్లడ్ మూన్..రక్తవర్ణంలో చందమామను ఏ సమయంలో వీక్షించొచ్చు..

Related Articles

Back to top button