KCR : కేసీఆర్‌పై హత్యాయత్నం ? దళితబంధు బకాయిలపై కేటీఆర్ అటాక్..
KCR : ఫామ్‌హౌస్ రచ్చ, కేటీఆర్ అరెస్ట్, డీజీపీకి కౌంటర్లు, రెండు రోజుల పరిణామాలతో తెలంగాణ అసెంబ్లీ అండ్ పొలిటికల్ సీన్ ముందు ముందు ఎలా మారుతుందో చూడాలి.
KCR
తెలంగాణ పాలిటిక్స్‌లో మరోసారి రాజకీయ వేడి నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు .. హత్యాయత్నానికి కుట్ర పన్నాయంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేల్చిన బాంబుతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఎర్రవల్లిలోని గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామనే వంకతో కాంగ్రెస్ కేడర్ తీవ్ర స్థాయిలో అరాచకానికి పాల్పడిందని కేటీఆర్ రగిలిపోయారు. ఫామ్‌హౌస్ వైపు వెళుతున్న తమను పోలీసులు బలవంతంగా అడ్డుకుని బోయిన్‌పల్లి పీఎస్‌కు తరలించగా.. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై నిప్పులు చెరిగారు.
సొంత నేత నివాస ప్రాంగణం వరకూ కాంగ్రెస్ శ్రేణులను ఏ ధైర్యంతో పోలీసులు రానిచ్చారని కేటీఆర్ నిలదీశారు. తమ సొంత ఇంటికి తాము వెళుతుంటే ఏ హక్కుతో అడ్డుకున్నారో తెలంగాణ డీజీపీయే తమకు జవాబు చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు. రూలింగ్ పార్టీ లీడర్స్ దాడులకు తెగబడుతుంటే చూసీ చూడనట్లు వదిలేసి, ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తూ అరెస్టులు చేయడం ఏరకమైన న్యాయమని నిలదీశారు.
ఎన్నికల టైమ్‌లో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా హ్యాండ్ ఇచ్చిందని, ఆ వైఫల్యాలను కవర్ చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. జనాలు తమ హామీల గురించి ఎక్కడ నిలదీస్తారో అనే భయంతోనే కాంగ్రెస్ ఈ రకమైన మైండ్ గేమ్స్ ఆడుతోందన్నారు. డైవర్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్.. ఈ మూడూ తప్ప సీఎం రేవంత్ రెడ్డికి మార్కెట్‌లో వేరే ట్యాలెంట్ ఏదీ లేదంటూ పంచ్ డైలాగ్స్‌తో ఎద్దేవా చేశారు.
ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేటీఆర్ సూచనలు చేశారు. కేవలం కేసీఆర్(KCR), బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే అసెంబ్లీని వాడుకోవడం ఆపాలని హితవు పలికారు. గులాబీ పార్టీని తిట్టడానికి ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించుకుని.. మిగతా రోజుల్లో ప్రజా సమస్యలపై మాట్లాడితే బెటర్ అంటూ ఎద్దేవా చేశారు.

దళితులపై నిజంగానే ప్రేమ ఉంటే కాంగ్రెస్ ఇచ్చిన దళిత, గిరిజన డిక్లరేషన్‌ను వెంటనే అమల్లోకి తేవాలని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దళిత బంధు కింద ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపించి.. ఇప్పుడేమో కనీసం 12 పైసలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో అధికార మదంతో ఎంత రచ్చ చేసినా ఆఖరికి ప్రజలే సుప్రీం అని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ వైఖరికి ప్రజలే పక్కాగా బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ఫామ్‌హౌస్ రచ్చ, కేటీఆర్ అరెస్ట్, డీజీపీకి కౌంటర్లు, రెండు రోజుల పరిణామాలతో తెలంగాణ అసెంబ్లీ అండ్ పొలిటికల్ సీన్ ముందు ముందు ఎలా మారుతుందో చూడాలి.





