Just TelanganaJust PoliticalLatest News

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ప్రెస్ మీట్.. పవన్ ప్రశ్నలకు పోలీసుల దగ్గర సమాధానం ఉందా?

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.

Pawan Kalyan

హైదరాబాద్ వేదికగా ఈరోజు అంటే జూన్ 2న జరగాల్సిన జనసేన పార్టీ సమ్మేళనానికి..తెలంగాణ పోలీసులు బ్రేక్ వేయడంతో రెండు రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జూన్ 2న సిటీలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించడం పెద్ద దుమారానికే దారితీసింది.

ఈ షాకింగ్ పరిణామంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లోనే అత్యవసరంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. ఈ సందర్భంగా కనీసం ప్రెస్‌మీట్ పెట్టుకోవడానికి అయినా తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా చూద్దాం అంటూ పవన్ చేసిన పవర్‌ఫుల్ కామెంట్లు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే ఈ మెగా సభకు పోలీసులు బ్రేక్ వేయడం వెనుక ముఖ్యంగా శాంతిభద్రతల సమస్యలతో పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వాతావరణం కూడా కారణం కావొచ్చని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ హాల్ లో ప్లాన్ చేసిన ఈ మీటింగ్‌కు సుమారు రెండు వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో.. ట్రాఫిక్ ఇబ్బందులు, పబ్లిక్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని పోలీసులు భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇదేమంత పెద్ద సభ కాదని.. దీనిని అడ్డుకోవడం ఏంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నిర్ణయం వెనుక కేవలం లొకేషన్ సమస్య మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)పై ఉన్న రాజకీయ వ్యతిరేకత, ఆయన గతంలో చేసిన కొన్ని కామెంట్లపై లోకల్ లీడర్స్ ఆగ్రహం, అలాగే సభ పేరులోనే తెలంగాణ నవనిర్మాణ అనే పదం ఉండటం వంటి అంతర్గత అంశాలు కూడా కారణమనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

సభ క్యాన్సిల్ అవడంతో.. పవన్ కళ్యాణ్ పెట్టబోయే ప్రెస్‌మీట్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూనే, మరోవైపు తెలంగాణలో జనసేన ఉనికి, భవిష్యత్ కార్యాచరణ , తనపై వస్తున్న విమర్శలన్నింటినీ కూడా బేస్ చేసుకుని ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) వేయబోయే ప్రశ్నలు..తెలంగాణ పోలీసులకే కాకుండా ఇక్కడి రాజకీయ వ్యవస్థకు కూడా ఒక సవాల్‌గా మారనున్నాయి. ఇటు పవన్ కూడా ఈ అంశాన్ని ఒక వ్యక్తిగత విషయంగా కాకుండా, రాజకీయంగా దక్కాల్సిన హక్కుల పోరాటంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారం వల్ల ఇటు జనసేన పార్టీపై, అటు తెలంగాణ రాజకీయాలపై గట్టి ప్రభావం పడేలా కనిపిస్తోంది. తెలంగాణలో వేగంగా ఎదగాలని చూస్తున్న జనసేన ప్రయత్నాలకు ఇది తక్షణ బ్రేక్‌గా మారడమే కాకుండా, కార్యకర్తల్లో కొంత నిరాశను మిగిల్చే అవకాశం ఉంది.

అలాగే ఈ క్లిష్ట పరిస్థితిని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత హుందాగా, చట్టబద్ధంగా ఎదుర్కొంటారనే దానిపైన కూడా పవన్ పొలిటికల్ ఇమేజ్ ఆధారపడి ఉంటుంది. మరోవైపు, స్థానిక ప్రాంతీయ పార్టీలు ఈ ఇష్యూను క్యాష్ చేసుకుంటూ పవన్ ఇక్కడ రాజకీయం చేస్తున్నారనే సెంటిమెంట్‌ను మళ్లీ తెర మీదకు తెస్తూ ప్రాంతీయతను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు.

Pawan Kalyan
Pawan Kalyan

కాగా ఈ కాంట్రవర్శీలో పవన్ గతంలో తెలంగాణపై చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా కొబ్బరిబోండాల విషయంలో దిష్టిపూజకు సంబంధించిన కామెంట్స్ ఇంకా సద్దుమణగకపోవడమే ప్రధాన మైనస్‌గా మారింది. నిరసనకారులు ఇప్పటికీ ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కొండగట్టు పర్యటనలో తనకు తెలంగాణపై చాలా ప్రేమ ఉందని పవన్ చెప్పినా, ఆలయ అభివృద్ధికి ఆర్థిక సాయం చేసినా కూడా ఇక్కడి నేతలు మాత్రం పవన్‌ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

దీంతో ఇప్పుడు అందరి దృష్టి పవన్ ప్రెస్‌మీట్‌పైనే ఉంది. జనసేన ఈ విషయంలో న్యాయపోరాటానికి దిగుతుందా లేక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తుందా అనేది తేలాల్సి ఉంది. నిజానికి ఇది కేవలం ఒక సభకు పర్మిషన్ నిరాకరించిన సాధారణ ఘటన ఏమీ కాదు. దీని వెనుక రెండు రాష్ట్రాల సెంటిమెంట్లతో పాటు, పార్టీల భవిష్యత్ వ్యూహాలతో ఒక పెద్ద పొలిటికల్ డ్రామా దాగి ఉందన్న వాదన వినిపిస్తోంది.

Pawan Kalyan : పవన్ సభకు నో పర్మిషన్..కోర్టుకెళ్లిన జనసేన.. ఏం జరగబోతోంది ?

Related Articles

Back to top button