Just TelanganaJust Andhra PradeshLatest News

Pawan Kalyan :తెలంగాణలో పవన్ కళ్యాణ్,లోకేష్ స్కెచ్..జూన్ 2న జనసేనాని మీటింగ్‌తో సమీకరణాలు మారతాయా?

Pawan Kalyan : ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పవర్‌ను షేర్ చేసుకున్న జనసేన పార్టీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Pawan Kalyan

ఏపీ రాజకీయాల్లో సంచలన విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన కూటమి, ఇప్పుడు తమ తర్వాతి లక్ష్యంగా తెలంగాణపై గట్టిగా ఫోకస్ పెట్టింది.

ఏపీలో రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించని విధంగా జెండా పాతేసిన ఈ రెండు పార్టీలు, ఇప్పుడు తెలంగాణలో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు సాగుతున్నాయి. ఈ సమయంలోనే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకురావడమే ధ్యేయంగా గ్రామస్థాయి నుంచి పార్టీలను స్ట్రాంగ్ చేయడానికి రెండు పార్టీల అధినేతలు రంగంలోకి దిగుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎంతో బలంగా ఉన్న టీడీపీ, రాష్ట్ర విభజన తర్వాత మాత్రం కొంత బలహీనపడింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిచినా.. వారంతా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంతో టీడీపీ కోలుకోలేని దెబ్బతింది.

ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి టీడీపీ పోటీ చేసినా కూడా పెద్దగా కలిసి రాలేదు. ఇక 2023 ఎన్నికలకు అయితే తెలుగుదేశం పార్టీ పూర్తిగా దూరంగానే ఉండిపోయింది.

అయితే ఏపీలో మళ్లీ పవర్‌లోకి రావడంతో ఇక్కడ కూడా పసుపు జెండాను పాతాళం నుంచి పైకి లేపాలని టీడీపీ హై కమాండ్ గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల జరిగిన మహానాడు వేదికగా టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలంగాణలో మళ్లీ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడం కూడా దీనిలో భాగమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పవర్‌ను షేర్ చేసుకున్న జనసేన పార్టీ కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తారీఖున ..హైదరాబాద్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పార్టీ ముఖ్య నేతలతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనుండటం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మీటింగ్‌లో తెలంగాణలో జనసేన పార్టీ నిర్మాణం, జిల్లా స్థాయి కమిటీలను స్ట్రాంగ్ చేయడం, యూత్‌ను పార్టీ వైపు ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టడం ,ఇక్కడి ప్రజా సమస్యలపై పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దిశానిర్దేశం చేయబోతున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan

ఇన్ని రోజులు కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితమైన జనసేన, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక ఇక్కడ కూడా పార్టీకి కొత్త జీవం పోయాలని డిసైడ్ అయింది. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ (GHMC) ఎన్నికలతో పాటు, 2028లో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్‌ను టార్గెట్ చేస్తూ కేడర్‌ను మరింత స్ట్రాంగ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైమ్‌ అని పవన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఏది ఏమైనా ఏపీలో సక్సెస్ అయిన ఈ కూటమి, తెలంగాణలో కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతుందా లేక విడివిడిగానే వెళుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Slippers:ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా? ఆర్థోపెడిక్ నిపుణులు చెప్తున్న ఆ 4 షాకింగ్ హెల్త్ సీక్రెట్స్ ఏంటి?

Related Articles

Back to top button