Just TelanganaLatest News

Route Map Around KBR Park : జూబ్లీహిల్స్ ట్రాఫిక్ కష్టాలకు పక్కా స్కెచ్..కేబీఆర్ పార్క్ చుట్టూ మారిన రూట్ మ్యాప్..

Route Map Around KBR Park : నాగార్జున సర్కిల్ (NFC) నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రెండు వైపులా వెహకల్స్ హాయిగా రాకపోకలు సాగించడానికి ఒకే ఒక్క ఎలివేటెడ్ కారిడార్‌ను డిజైన్ చేస్తున్నారు.

Route Map Around KBR Park

ట్రాఫిక్ నరకానికి చెక్ పెట్టడానికి వేసిన ప్లాన్లు ఒక్కోసారి అనుకోకుండా టర్న్‌లు తిరుగుతుంటాయి. రీసెంట్‌గా హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్ సర్కిల్ వద్ద డైలీ నరకం చూపించే ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి కేబీఆర్ పార్క్ చుట్టూ ఏకంగా ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాస్‌లు కట్టాలని అధికారులు వేసిన గ్రాండ్ ప్లాన్‌కు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది.

అన్ని భారీ నిర్మాణాలు వద్దని, ఆ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేసి రీ-అలైన్మెంట్ చేయడానికి అధికారులు రెడీ అవుతున్నారు. కేవలం ఒకే ఒక్క వన్ వే కండీషన్ తెచ్చిన మార్పులు, దాని ఆధారంగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్ మార్గంలో ట్రాఫిక్ తగ్గించడానికి అధికారులు ప్రయోగాత్మకంగా వన్ వే విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో వాహనదారులు కొద్దిగా ఇబ్బంది పడినా, ప్రయాణ దూరం పెరిగినా కూడా సిగ్నల్స్ దగ్గర గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేకపోవడంతో ట్రాఫిక్ చాలా స్మూత్‌గానే సాగిపోయింది.

కాకపోతే చాలామంది ఇప్పటికీ తమ ఆవేదనను వెళ్లగక్కుతూనే ఉన్నారు. దీంతో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పార్క్(Route Map Around KBR Park) చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్‌లు కట్టి అనవసరంగా కోట్లాది రూపాయలను వృధా చేయడం కంటే, ఒక్క వన్ వే సీన్‌నే పర్మనెంట్‌గా ప్లాన్ చేస్తే బెటర్ కదా అనే క్లారిటీకి అధికారులు వచ్చారు.

అందుకే ఇప్పుడు ఆ పాత నిర్మాణాలన్నిటినీ రద్దు చేసి, నాగార్జున సర్కిల్ (NFC) నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రెండు వైపులా వాహనాలు హాయిగా రాకపోకలు సాగించడానికి ఒకే ఒక్క ఎలివేటెడ్ కారిడార్‌ను డిజైన్ చేస్తున్నారు. ఈ రీ-అలైన్మెంట్ వల్ల ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు తగ్గడమే కాకుండా భూసేకరణ కోసం అయ్యే భారీ వ్యయం కూడా తగ్గనుంది .

Route Map Around KBR Park
Route Map Around KBR Park

అయితే ఫ్లైఓవర్ల కోసం ఇప్పటికే తవ్విన గుంతలను వెంటనే పూడ్చివేసి, వన్ వే ట్రాఫిక్‌కు అనుకూలంగా రోడ్డును లెవెల్ చేయబోతున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట వైపు నుంచి మాదాపూర్, ఐటీ కారిడార్ వెళ్లే వాహనదారులకు అస్సలు తిరుగుండదు.

దీనికి తోడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి నాలెడ్జ్ సిటీ, శిల్పా లేఅవుట్ వరకు సుమారు9 కిలోమీటర్ల వరకూ రూ.1,656 కోట్ల అంచనా ఖర్చుతో మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్ఎండీఏ ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది.
ఈ కారిడార్ రోడ్ నెంబర్ 12, ఏసీబీ ఆఫీసు మీదుగా సాగబోతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులను టెంపరరీగా నిలిపివేసి ఈ కొత్త మార్పులను బల్దియా అమలు చేస్తోంది. ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తే కనుక కేబీఆర్ పార్క్(Route Map Around KBR Park) చుట్టుపక్కల జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీకి పర్మినెంట్‌గా ముగింపు పడటం గ్యారంటీగా కనిపిస్తోంది.

IndiGo : ప్రయాణీకులకు ఇండిగో బిగ్ షాక్.. ఆ ఛార్జీలన్నీ భారీగా పెరిగాయ్..

Related Articles

Back to top button