Just TelanganaJust PoliticalLatest News

Self Enumeration : సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ ప్రారంభం..మే 10 వరకు అవకాశం

Self Enumeration : ఏవైనా తప్పులుంటే సవరణ ఆప్షన్ ద్వారా రీ చెక్ చేసుకోవచ్చు. వెంటనే సబ్‌మిట్ చేయలేకపోతే సేవ్‌ డ్రాఫ్ట్‌గా కూడా ఉంచుకోవచ్చు.

Self Enumeration

జనగణన-2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఒక వినూత్న అవకాశాన్ని కల్పించింది. సాధారణంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి ప్రజల దగ్గర వివరాలు సేకరిస్తారు. కానీ ఈసారి మాత్రం ప్రజలే తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే స్వీయ గణన (Self Enumeration) అంటే సెల్ఫ్ ఎన్యుమరేషన్ పద్ధతిని ప్రవేశపెట్టారు.

ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవగా.. మే 10వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రజలకు తమ సమాచారాన్ని సీక్రెట్‌గా ఎంటర్ చేసుకునే వీలు కలగడమే కాకుండా, ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు సమయం కూడా ఆదా అవుతుంది.

ఈ ప్రక్రియ కోసం సెల్ఫ్ ఎన్యుమరేషన్ అఫీషియల్ వెబ్‌సైట్ ( https://se.census.gov.in ) సందర్శించాలి. అక్కడ లాగిన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకున్నాక.. వివరాలు ఇచ్చి వెరిఫై చేయాలి. కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఒకసారి యజమాని పేరు నమోదు చేస్తే మళ్లీ మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా టైప్ చేయాలి.

లాగిన్ అయిన తర్వాత మీరు ఉంటున్న ఇంటిని మ్యాప్‌లో గుర్తించాల్సి ఉంటుంది. పిన్‌కోడ్, గ్రామం, సిటీ పేరు నమోదు చేస్తే మ్యాప్ కనిపిస్తుంది. అందులో మీ ఇంటిని కరెక్ట్‌గా పాయింట్ చేయడం వల్ల అక్షాంశ, రేఖాంశాలు కచ్చితంగా నమోదవుతాయి. ఈ స్థానాన్ని తప్పుగా గుర్తిస్తే మీ డేటా సంబంధిత ఎన్యుమరేటర్‌కు చేరదు.

ఆ తర్వాత మీ ఇంటి నిర్మాణానికి వాడిన వస్తువుల వివరాలు, అంటే నేల, గోడలు, పైకప్పు దేనితో నిర్మించారో కూడా పేర్కొనాలి. ఒకవేళ ఇల్లు శిథిలావస్థలో ఉన్నా లేదంటే మరమ్మత్తులకు వీలు లేకుండా ఉన్నా సరే ఆ విషయాన్ని స్పష్టంగా తెలపాలి.

కుటుంబ సభ్యుల వివరాల విషయానికి వస్తే, ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, వారి వయస్సు ఎంతనే వివరాలు ఇవ్వాలి. సామాజిక వర్గం నమోదు చేసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ లేదా ఇతరులు అనే ఆప్షన్లు ఉంటాయి. ఎస్సీ కేటగిరీ కేవలం హిందూ, సిక్కు బౌద్ధ మతస్థులకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఎస్టీ కేటగిరీ ఏ మతానికి చెందిన వారికైనా వర్తిస్తుంది. వీటితో పాటు ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి. అది సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా వంటి ప్రాథమిక సమాచారం కూడా ఇవ్వాలి.

అంతే కాకుండా ఇంటి సౌకర్యాలకు సంబంధించిన మరిన్ని వివరాలు అవసరమవుతాయి. తాగునీటి సౌకర్యం ఇంటి లోపలే ఉందా లేక నిర్ణీత దూరంలో ఉందా అనేది కూడా ఎంటర్ చేయాలి. వెలుతురు కోసం వాడే వనరులు, టాయిలెట్ వసతితో పాటు మురుగునీటి పారుదల సౌకర్యం, వంట కోసం వాడే ఇంధనం వంటి వాటిని కూడా ఎంచుకోవాలి.

ఇంట్లో టీవీ, ఇంటర్నెట్, కంప్యూటర్, ఫోన్, రేడియో వంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు కారు లేదా బైక్ వంటి వాహనాలు ఉన్నాయా అనే సమాచారాన్ని కూడా అడుగుతారు. మీరు రోజువారీ ఆహారంలో ముఖ్యంగా ఉపయోగించే రైస్ వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది(Self Enumeration).

Self Enumeration
Self Enumeration

వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోవడం మంచిది. ఏవైనా తప్పులుంటే సవరణ ఆప్షన్ ద్వారా రీ చెక్ చేసుకోవచ్చు. వెంటనే సబ్‌మిట్ చేయలేకపోతే సేవ్‌ డ్రాఫ్ట్‌గా కూడా ఉంచుకోవచ్చు. కానీ ఒకసారి నిర్ధారించి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత డేటాలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు.

ప్రక్రియ విజయవంతంగా ముగిశాక మీ ఫోన్ లేదా ఈ-మెయిల్‌కు ఒక ఐడీ నంబర్ వస్తుంది. ఎన్యుమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని వారికి చెబితే వారు తమ వద్ద ఉన్న సమాచారంతో చెక్ చేసి ఫైనల్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒకవేళ మీరు ఇటీవల నిర్వహించిన ఎన్యుమరేషన్‌కు వివరాలు అందించకపోయినా.. ఇప్పుడు స్వీయ గణన(Self Enumeration) చేసుకోకపోయినా.. తర్వాత ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు మళ్లీ మొదటి నుంచి అన్ని వివరాలు చెప్పాల్సి ఉంటుంది.

Cabinet Meeting: రేపే కేబినెట్ భేటీ.. పెన్షన్ల పంపిణీ, భూ కేటాయింపులపై రానున్న స్పష్టత

Related Articles

Back to top button