Just Andhra PradeshJust Political

Free Bus: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు

Free Bus: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) శుభవార్తను అందించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Free Bus: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) శుభవార్తను అందించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15, 2025 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసిన చంద్రబాుబ.. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించవచ్చనే దానిపై కూడా ముఖ్యమంత్రి పూర్తి స్పష్టత ఇచ్చారు.

Free Bus Travel:

సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం
Free Bus: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ‘సూపర్ సిక్స్’ హామీల(AP Super Six Guarantees)ను ప్రకటించింది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ(Free Bus Travel) సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చడానికి నిరంతరం కసరత్తు చేస్తోంది.

ఇతర రాష్ట్రాల అధ్యయనం, ఏపీలో ఏర్పాట్లు
ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు పథకాలను అధ్యయనం చేయడానికి ఏపీ మంత్రులు, అధికారులు అక్కడికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. ఈ వివరాల ఆధారంగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే నెల నుంచే ఈ ఉచిత బస్సు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన
మంగళవారం శ్రీశైలంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సున్నిపెంటలో జరిగిన బహిరంగ సభలో మరోసారి ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా పరిధిలోనే ఉచితంగా ప్రయాణించవచ్చు. జిల్లాలో ఎక్కడికి వెళ్లాలన్నా, ఆడబిడ్డలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

free-bus
free-bus

ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భారం తగ్గి, వారి ప్రయాణ స్వేచ్ఛ పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. మహిళా సాధికారత దిశగా ఇది ఒక కీలకమైన అడుగుగా నిలవనుంది. కొద్ది రోజులుగా సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ గురించి మహిళలు ఎదురు చూస్తున్నారు. ఆగస్గ్ 15 న పథకం అమలు ఉంటుందని తెలిసినా ..ఇప్పుడు మరోసారి సీఎం చంద్రబాబు ఇచ్చిన క్లారటీతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also read:

Sai Pallavi :రామాయణం కంటే ముందే బాలీవుడ్‌లో మెరవనున్న సాయి పల్లవి

Dhanush:అవును నిజమే ..మనకూ ఓ ధనుష్ ఉన్నాడు !

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button