Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 9లో మిడ్ వీక్ ఎలిమినేషన్, వీకెండ్ షాక్

Bigg Boss తాజాగా, ఈ వారం బిగ్ బాస్ ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్‌తో సంచలనం సృష్టించాడు.

Bigg Boss

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9 Telugu) ఈసారి ముందు నుంచీ చెబుతున్నట్టుగానే అంచనాలకు అందకుండా సాగుతోంది. ఒక వైపు వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌ను పెంచితే, మరోవైపు కంటెస్టెంట్ల మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలు, చిలిపి అల్లరి హద్దులు దాటి రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈ క్రమంలో, బిగ్ బాస్ ఈ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్‌తో ప్రేక్షకులకు షాకిచ్చాడు.

ఆరోగ్య కారణాల ఆయేషా ఎలిమినేషన్..ముందుగా, ఈ వారం మిడ్ వీక్‌లో అనూహ్యంగా కంటెస్టెంట్ ఆయేషా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమెకు టైఫాయిడ్ వచ్చి ఆరోగ్యం విషమించడంతో, బిగ్ బాస్ ఆమెను మధ్యలోనే ఇంటికి పంపించినట్టుగా సమాచారం. ఆయేషా అనారోగ్యం కారణంగా వెళ్లిపోవడంతో, ఈ వారం వీకెండ్‌లో మరో ఎలిమినేషన్ ఉండదని అంతా ఊహించారు.

Bigg Boss
Bigg Boss

వీకెండ్‌లో రమ్య మోక్షకు షాక్..అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, బిగ్ బాస్(Bigg Boss) వీకెండ్‌లో రెండో ఎలిమినేషన్‌ను కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ వారం అఫీషియల్ ఎలిమినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ రమ్య మోక్ష ఇంటి నుంచి బయటకు వెళ్లినట్టు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో, ఈ వార్త బయటకు వచ్చింది. రమ్య మోక్ష ఎలిమినేషన్ కోసం గత వారం నుంచే ఊహాగానాలు వచ్చినా, అనూహ్యంగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు. రమ్య కేవలం రెండు వారాలపాటు మాత్రమే హౌస్‌లో ఉంది. ఈ కొద్ది సమయానికి గాను ఆమె రూ.3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

కలకలం రేపుతున్న దమ్ము శ్రీజ రీ-ఎంట్రీ..ఒకే వారం ఇద్దరు కంటెస్టెంట్లు – ఒకరు ఆరోగ్య కారణాల వల్ల, మరొకరు ఓటింగ్ ప్రక్రియ ద్వారా – హౌస్ నుంచి బయటకు వెళ్లడంతో, హౌస్‌లో సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో, ఎలాంటి బలమైన సమస్య లేదా కారణం లేకుండా గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ దమ్ము శ్రీజను మళ్లీ హౌస్‌లోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని బిగ్ బాస్ (Bigg Boss)వర్గాల నుంచి బలమైన వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో ‘పచ్చళ్ల పాప’గా పాపులర్ అయిన దమ్ము శ్రీజ, తన ఆవేశం, వాదనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమెను రీ-ఎంట్రీ పేరుతో వచ్చే వారం మిడ్ వీక్‌లో హౌస్‌లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీమ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీజ మళ్లీ వస్తే, హౌస్‌లో ఆట మరింత వైలెంట్‌గా, ఆసక్తికరంగా మారుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు, హౌస్‌లో తన గేమ్ స్ట్రాటజీని మెరుగుపరుచుకుంటూ వస్తున్న ఇమ్మాన్యుయేల్ మరోసారి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇది అతని గేమ్ గ్రాఫ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లి, టైటిల్ రేస్‌లో నిలబెట్టడానికి ప్లస్ అవనుంది.

Kohinoor diamond : కోహినూర్ వజ్రం చోరీ వెనుక కథ.. ఇంగ్లండ్ రాణి కిరీటంలోకి ఇలా చేరిందా?

Related Articles

Back to top button