Just NationalJust Andhra PradeshLatest News

Madavi Hidma: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నేత మడావి హిడ్మా హతం..ఎవరీ హిడ్మా?

Madavi Hidma: అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు అతని భార్య సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.

Madavi Hidma

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో కాలంగా సవాల్ విసిరిన, అత్యంత మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడావి హిడ్మా (50), ఎట్టకేలకు హతమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు అతని భార్య సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం.

ఎవరు ఈ మడావి హిడ్మా(Madavi Hidma)? బయోడేటా , నేర చరిత్ర ఏంటంటే..మడావి హిడ్మా(Madavi Hidma) ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడు. అతని నేర చరిత్ర, మావోయిస్టు కార్యకలాపాల్లో వ్యూహకర్తగా అతని పాత్ర భారత భద్రతా బలగాలకు నిరంతరం సవాల్‌గా ఉండేది.

మావోయిస్టు అత్యున్నత నాయకత్వం.. హిడ్మా(Madavi Hidma) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ (Central Committee)లో సభ్యుడిగా ఉండేవాడు. మావోయిస్టు కేంద్ర నాయకత్వంలో ఇంతటి కీలకమైన నాయకుడు ఎన్‌కౌంటర్‌లో మరణించడం అనేది దళాలకు అతిపెద్ద నష్టం.

గెరిల్లా దాడుల వ్యూహకర్త.. హిడ్మా ‘గెరిల్లా యుద్ధ వ్యూహాల’లో దిట్టగా పేరు పొందాడు. దాడుల సమయంలో బలగాలను వలయంగా చుట్టుముట్టి దాడి చేసే ‘గది వ్యూహం’ (Gadhi Strategy) రూపొందించడంలో అతనే కీలకపాత్ర పోషించేవాడు.

మోస్ట్ వాంటెడ్.. 2010లో దంతెవాడలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల హత్య, అలాగే సుక్మా జిల్లాలో 2017లో 25 మంది జవాన్ల ఊచకోత వంటి అనేక భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త , ప్రధాన సూత్రధారి హిడ్మానే. ఈ దాడుల కారణంగానే అతను అత్యంత మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.

Madavi Hidma
Madavi Hidma

భద్రతా బలగాలకు చిక్కకుండా ఉండేందుకు హిడ్మా తరచూ తన గుర్తింపును మారుస్తూ ఉండేవాడు. విలాస్, హిడ్మాల్, సంతోష్ వంటి అనేక పేర్లతో అతను మావోయిస్టు కార్యకలాపాల్లో తిరిగాడు. అతని ఈ వివిధ పేర్లు మరియు రహస్య జీవితం కారణంగానే అతని అసలు రూపం కూడా ఇన్నాళ్లూ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

సుమారు 25 ఏళ్లుగా హిడ్మా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నా, అతని అసలు రూపం ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు. ఇన్నాళ్లూ కేవలం 25 ఏళ్ల క్రితం నాటి పాత ఫోటో మాత్రమే ఉండేది. ఈ ఏడాది జూన్‌లో మాత్రమే అతని యొక్క కొత్త ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని మావోయిస్టుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

మారేడుమిల్లి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై ఎదురు కాల్పులు జరిపారు.

ఈ ఎదురు కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతం ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల, కూంబింగ్‌లో ఏపీ పోలీసులు అదనపు బలగాలను ఉపయోగించినట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం లక్ష్యం , ఆపరేషన్ ‘కగార్’
మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహిస్తోంది.

ఆపరేషన్ కగార్ (Operation Kagar).. మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఆపరేషన్ కగార్’ను పెద్ద ఎత్తున కొనసాగిస్తోంది. మావోయిస్టుల స్థావరాలను ధ్వంసం చేయడం, వారి నాయకత్వాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం.

వచ్చే ఏడాది మార్చిలోపు దేశంలో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. హిడ్మా వంటి కీలక నేత మరణం ఈ లక్ష్యం వైపు ఒక పెద్ద ముందడుగు.

మడావి హిడ్మా ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి ఒక గట్టి ఎదురుదెబ్బ. అనేక భారీ దాడులకు వ్యూహకర్త అయిన హిడ్మా మరణంతో, మావోయిస్టుల గెరిల్లా కార్యకలాపాలు రాబోయే రోజుల్లో బలహీనపడే అవకాశం ఉంది. ఇది భద్రతా బలగాలు సాధించిన అత్యంత ముఖ్యమైన విజయంగా పరిగణించబడుతోంది.

Rajamouli: రాజమౌళికి వరుస చిక్కులు.. వివాదాల సుడిగుండంలో దర్శక ధీరుడు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button