Just SportsLatest News

1st Ashes Test: పెర్త్ లో ఇంగ్లాండ్ కే ఎర్త్..  యాషెస్ తొలి టెస్ట్ ఆసీస్ దే

1st Ashes Test: 40 పరుగుల ఆధిక్యంతో ఉత్సాహంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఖాతా తెరవకుండానే క్రాలే వికెట్ కోల్పోయింది.

1st Ashes Test

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్(1st Ashes Test) తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ట్రావిడ్ హెడ్ విధ్వంసకర శతకంతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. రెండు రోజుల్లో మొత్తం 23 వికెట్లు నేలకూలగా.. రెండో రోజు చివరి సెషన్ లో మాత్రం హెడ్ సునామీ బ్యాటింగ్ హైలెట్ గా నిలిచింది. తొలిరోజే 19 వికెట్లు పడడంతో రెండోరోజు ఆటపై ఆసక్తి పెరిగింది. ఓవన్ నైట్ స్కోర్ 123/9 పరుగులతో రెండోరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 9 రన్స్ మాత్రమే జోడించగలిగింది. 132 పరుగులకు ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.

40 పరుగుల ఆధిక్యంతో ఉత్సాహంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఖాతా తెరవకుండానే క్రాలే వికెట్ కోల్పోయింది. తర్వాత డకెట్, పోప్ 65 పరుగులు జోడించడంతో మంచి స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఆసీస్ పేసర్ స్కాట్ బొలాండ్ వీరిద్దరినీ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాటర్ రెండోఇన్నింగ్స్ లోనూ రాణించలేదు. అటు స్టార్క్ కూడా నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 164 పరుగులకే ఆలౌటైంది.

1st Ashes Test
1st Ashes Test

బోలాండ్ 4, స్టార్క్ 3, డోగెట్ 3 వికెట్లతో రాణించారు. 205 పరుగుల టార్గెట్ కావడం ఆస్ట్రేలియా ఇబ్బందిపడుతుందని అంతా అనుకున్నారు. అయితే ట్రావిడ్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. టీ ట్వంటీ తరహాలో రెచ్చిపోయిన హెడ్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్రత్యర్ధి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశాడు. హెడ్ కేవలం 69 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా యాషెస్ సిరీస్ (1st Ashes Test)లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు.

గతంలో గిల్ క్రిస్ట్ 57 బంతుల్లో సెంచరీ బాదాడు. హెడ్ 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 123 రన్స్ చేయగా.. అటు లబూషేన్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. ఈ మ్యాచ్ లో 10 వికెట్లు తీసిన మిఛెల్ స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. యాషెస్(1st Ashes Test) చరిత్రలో ఈ మ్యాచ్ 847 బంతుల్లోనే ముగిసిపోవడంతో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ గా రికార్డులకెక్కింది. ఈ సిరీస్ లో రెండో టెస్ట్ డిసెంబర్ 4న గబ్బాలో ప్రారంభవుతుంది. ఈ లోపు ఇంగ్లాండ్ జట్టు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button