Silver rate: వెండి దూకుడు ఆగేదెన్నడు ? ఏడాది రెట్టింపయిన ధర
Silver rate: సరిగ్గా 12 నెలల కాలంలో వెండి లక్ష పెరిగింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 60 శాతం జంప్ అయ్యింది.
Silver rate
సాధారణంగా బంగారం ధరలు వేగంగా పెరుగుతుంటాయి. వెండి ధర (Silver rate)పెరిగినా బంగారంతో పోలిస్తే కాస్త వెనుకే ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. వెండి బంగారాన్ని మించి దూసుకుపోతోంది. అక్టోబర్‌లో రెండు లక్షలు టచ్ చేసి..కొంత తగ్గిన సిల్వర్…ఇప్పుడు మళ్లీ రెండు లక్షలు దాటుతోంది. రాబోయే కాలంలో ఐదు లక్షలు దాటినా ఆశ్చర్యం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
సరిగ్గా 12 నెలల కాలంలో వెండి లక్ష పెరిగింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 60 శాతం జంప్ అయ్యింది. అక్టోబర్ 1న 1,52,000 వున్న వెండి(Silver rate)…ఇప్పుడు ఏకంగా 1,92,000 పెరిగింది. ఈస్థాయిలో వెండి రేటు పెరుగుతందని ఎవరూ ఊహించలేదు. నిజానికి గత ఐదేళ్ళుగా వెండి ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. 2019లో కేజీ వెండి రేటు 40,600గా ఉంటే 2020 వచ్చే సరికి సుమారు 23 వేలు పెరిగి 63,435 అయ్యింది. 2021లో పెద్దగా పెరగలేదు. 2022లో తగ్గుదల నమోదై 55,100 రూపాయలకు చేరింది.

అయితే 2023 నుంచి మాత్రం వెండి ధర(Silver rate)కు రెక్కలొచ్చేశాయి. 2023లో 78,600 వరకూ, 2024లో 95,700 వరకూ చేరిపోయింది. 2025లో అయితే అసలు అడ్డే లేకుండా పెరిగింది. ఏకంగా లక్షా 92వేలకు ఎగబాకింది. అంటే దాదాపు 96,300 రూపాయలు పెరిగినట్టు అర్థమవుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 15న ఏకంగా 2 లక్షల ఏడు వేలను టచ్ చేసింది. ఇది కాస్తా రానున్న కాలంలో ఐదు లక్షలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. పారిశ్రామిక డిమాండ్, పండుగ సీజన్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ,డాలర్ హెచ్చుతగ్గులు కూడా సిల్వర్ హైక్‌కు కారణమవుతున్నాయి. అమెరికా సహా అనేక దేశాల్లో ఆర్థిక అనిశ్చితి, రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో జనం సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు.
పారిశ్రామిక అవసరాల్లో వెండి(Silver rate)కి డిమాండ్ బాగా ఉండడం ఈ పెరుగదలకు మరొక కారణం. బ్యాటరీలు, సోలార్ ప్యానెల్లు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాలలో సిల్వర్‌ను ఉపయోగిస్తారు. .
వెండి ధరలను అంతర్జాతీయ మార్కెట్లు కూడా ప్రభావితం చేస్తాయి. సాధారణంగా పూజా సామాగ్రి, వెండి విగ్రహాలు, పళ్లాలు, గ్లాసులు, కొన్ని పాత్రల తయారీకి వెండిని ఉపయోగిస్తారు.

చీరలకు వేసే జరీలో కూడా వెండిని వాడుతారు. కాని, వీటి వినియోగం కంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, సెమీ కండక్టర్లు, ఫొటోగ్రఫీ రంగాల్లో వాడుతుంటారు. ఔషధ, రసాయనాలు, ప్లేటింగ్, సోల్డర్స్, ఫాయిల్స్ తయారీలో కూడా వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మధ్య వెండిలో రాగిని మిక్స్ చేసి ఆభరణాలుగా వాడడం ఎక్కువైంది. ఇది కూడా డిమాండ్ పెరగడానికి కారణమైంది.
వైద్య రంగంలోనూ వెండి వాడకం చాలానే ఉంది. గాయాలకు పెట్టే డ్రెస్సింగ్‌లు, యాంటీబ్యాక్టీరియల్ కోటింగ్లకు దీనిని వినియోగిస్తారు. ఓవరాల్ గా అనేక పారిశ్రామిక అవసరాలతో పాటు అనేక రంగాలకు ఈస్థాయిలో డిమాండ్ వుంటుంది. డిమాండ్ కు తగ్గట్టు సప్లై లేకపోవడంతో రేటు పెరుగుతూ పోతోంది. రాబోయే కాలంలో 4-5 లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదంటూ అంచనా వేస్తున్నారు.



