Just EntertainmentJust NationalLatest News

Akhanda 2 for Modi: మోదీకి అఖండ 2 స్పెషల్ షో ..

Akhanda 2 for Modi: ప్రధాని మోదీ 'అఖండ 2' గురించి విన్నారు. ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. త్వరలోనే ఢిల్లీలో ఈ సినిమాకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం.

Akhanda 2 for Modi

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ 2’ సినిమా థియేటర్స్ లో మాస్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమా ముందే చెప్పిన డేట్ కి రిలీజ్ చేసి ఉంటే మంచి హైప్‌తో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి దూసుకుపోయేది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడటంతో హైప్ తగ్గిపోయి, ఓపెనింగ్స్ అనుకున్నంత రాలేదు. కానీ మాస్ ప్రేక్షకులకు, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్లకు, దేశభక్తులకు ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది.

‘అఖండ 2’ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నార్త్ లో కూడా బాగా ప్రమోషన్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి ఇప్పటికే సినిమాలోని కొంత భాగాన్ని మూవీ యూనిట్ కలిసి చూపించారు. బాలయ్య, బోయపాటి, సంయుక్త మీనన్, నిర్మాతలు యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. ఆయనకు ఈ సినిమా నచ్చేసింది.

Akhanda 2 for Modi
Akhanda 2 for Modi

అయితే ఇప్పుడు ‘అఖండ 2’ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ చూస్తారట. ఇటీవల జరిగిన ‘అఖండ 2’ సక్సెస్ మీట్ లో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ‘అఖండ 2’ (Akhanda 2 for Modi)గురించి విన్నారు. ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. త్వరలోనే ఢిల్లీలో ఈ సినిమాకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ఆ షోను ప్రధాని నరేంద్ర మోదీ కూడా చూస్తారు” అని తెలిపారు. ఢిల్లీలో ఎంపీలకు అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలను ప్రదర్శిస్తారని తెలిసిందే.

ఈ క్రమంలో ‘అఖండ 2’ కూడా త్వరలోనే ఎంపీలకు స్పెషల్ షో(Akhanda 2 for Modi) వేయనున్నారు. ఈ షోకి ప్రధాని మోదీ కూడా హాజరవుతారని సమాచారం. దీంతో బాలయ్య, బోయపాటి కూడా ఈ షోకి హాజరవుతారా, మోదీని కలుస్తారా అనే చర్చ నెలకొంది. అసలే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో బాలయ్య మోదీని కలుస్తారని వార్త ఫ్యాన్స్ తో పాటు కార్యకర్తల్లో సంతోషాన్ని నింపుతుంది. మరి మోదీ వచ్చి ‘అఖండ 2’ సినిమా చూస్తారా, బాలయ్యని కలుస్తారా చూడాలి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button