Just InternationalLatest News

Sydney: సిడ్నీ ఘటనలో నిందితుడికి హైదరాబాద్ మూలాలున్నాయా? పోలీసులు ఏం చెప్పారు?

Sydney: సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ అని, ఆయన ఇక్కడే బీకాం పూర్తి చేసి 1998లో ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలిసింది.

Sydney

ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరం సిడ్నీ(Sydney)లో జరిగిన దారుణ కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డిసెంబర్ 14వ తేదీ ఆదివారం బోండీ బీచ్‌లో హనుక్కా వేడుకలు జరుగుతున్న సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 15 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉగ్రదాడిగా ప్రకటించింది. అయితే ఈ (Sydney)దాడికి పాల్పడిన నిందితుల్లో ఒకరికి హైదరాబాద్‌తో సంబంధం ఉండటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

ఈ ఘాతుకానికి పాల్పడిన(Sydney) వారిని 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ , అతని కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌గా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో తండ్రి సాజిద్ అక్రమ్ మరణించగా, కుమారుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

దర్యాప్తు సంస్థల విచారణలో సాజిద్ అక్రమ్ దగ్గర భారత పాస్‌పోర్ట్ లభించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అది హైదరాబాద్‌లో జారీ అయినట్లు గుర్తించడంతో అక్కడి అధికారులు భారత ప్రభుత్వానికి సమాచారం అందించారు. సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ అని, ఆయన ఇక్కడే బీకాం పూర్తి చేసి 1998లో ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలిసింది.

ఈ అంశంపై కలకలం రేగడంతో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. సాజిద్ అక్రమ్ చరిత్రను పరిశీలిస్తే, ఆయన 1998లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లారని, అక్కడ ఒక యూరోపియన్ యువతిని పెళ్లి చేసుకుని స్థిరపడ్డారని తెలిపారు.

Sydney
Sydney

ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని, వారు ఆస్ట్రేలియా పౌరులేనని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. సాజిద్ గత 27 ఏళ్లలో కేవలం ఆరు సార్లు మాత్రమే భారత్‌కు వచ్చారని, అది కూడా కుటుంబ ఆస్తుల పంపకాలు లేదా తల్లిదండ్రులను చూడటానికి మాత్రమే వచ్చారని పోలీసులు వెల్లడించారు. ఆఖరికి తన తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన భారత్‌కు రాలేదని తెలిసింది.

సాజిద్ అక్రమ్ ఉగ్రవాదం లేదా ఐసీస్ భావజాలం వైపు మళ్లడానికి హైదరాబాద్ లేదా తెలంగాణలోని పరిస్థితులతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1998లో ఆయన దేశం విడిచి వెళ్లే వరకు ఆయనపై ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేవని స్పష్టం చేశారు.

ఆయన విదేశాలకు వెళ్లిన తర్వాతే అక్కడ ఉన్న పరిస్థితులు లేదా ఇంటర్నెట్ ద్వారా తీవ్రవాద భావజాలానికి ప్రభావితమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ఫిలిప్పీన్స్ మరియు పాకిస్థాన్ వంటి దేశాలకు వెళ్లి ఉండవచ్చనే కోణంలో నిఘా వర్గాలు ఇప్పుడు ఆరా తీస్తున్నాయి.

ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర నిఘా వర్గాలు సాజిద్ అక్రమ్ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నాయి. ఆయన ఎప్పుడెప్పుడు ఏయే దేశాలకు వెళ్లారు, ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు అనే అంశాలపై ఆస్ట్రేలియా అధికారులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నిరాధారమైన వార్తలను లేదా ఊహాగానాలను నమ్మవద్దని, మీడియా కూడా వాస్తవాలను ధృవీకరించుకున్న తర్వాతే వార్తలను ప్రసారం చేయాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు ఈ దాడి వెనుక ఉన్న అసలు కుట్రదారులను పట్టుకునేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నాయి.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button