HealthJust LifestyleLatest News

Diseases: మీరూ ఇంటర్నెట్‌లో రోగాల కోసం వెతుకుతున్నారా?

Diseases: ఉదాహరణకు మీరు తలనొప్పి అని సెర్చ్ చేస్తే అది వందల కొద్దీ కారణాలను చూపిస్తుంది. అందులో సాధారణ అలసట నుంచి భయంకరమైన వ్యాధుల వరకు అన్నీ ఉంటాయి.

Diseases

ప్రస్తుత డిజిటల్ యుగంలో మనకు ఏ చిన్న అనారోగ్యం(Diseases) వచ్చినా ముందుగా చేసే పని గూగుల్‌లో వెతకడం. 2025లో గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ చూస్తుంటే చాలా మంది సైబర్ కాండ్రియా అనే సమస్యతో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. అంటే చిన్న తలనొప్పిని కూడా బ్రెయిన్ ట్యూమర్ అని చిన్న దగ్గును లంగ్ క్యాన్సర్ అని భయపడిపోవడం. అసలు గూగుల్ చెప్పే ఆరోగ్య విషయాల్లో ఎంత నిజం ఉంది . మనం ఎప్పుడు నిజంగా భయపడాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్ ఇచ్చే సమాచారం ఎందుకు భయపెడుతుంది..గూగుల్ అనేది ఒక లైబ్రరీ లాంటిది. అక్కడ సమాచారం ఉంటుంది కానీ అది మీ శరీర తత్వాన్ని బట్టి ఉండదు. ఉదాహరణకు మీరు తలనొప్పి అని సెర్చ్ చేస్తే అది వందల కొద్దీ కారణాలను చూపిస్తుంది. అందులో సాధారణ అలసట నుంచి భయంకరమైన వ్యాధుల(Diseases) వరకు అన్నీ ఉంటాయి. మనం ఎప్పుడూ అందులోని అతి భయంకరమైన వ్యాధినే మనకు ఉందని ఊహించుకుంటాం. దీనివల్ల బాడీలో స్ట్రెస్ పెరిగి లేని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

Diseases
Diseases

దీర్ఘకాలిక లక్షణాలు ఏదైనా నొప్పి లేదా సమస్య వారం రోజుల కంటే ఎక్కువ కాలం పాటు తగ్గకుండా ఉంటే అది సాధారణ సమస్య కాకపోవచ్చు. తీవ్రత పెరగడం రోజురోజుకూ సమస్య పెరుగుతున్నా లేదా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గకపోయినా డాక్టర్‌ని సంప్రదించాలి. అనూహ్య మార్పులు బరువు హఠాత్తుగా తగ్గడం మరియు ఆకలి మందగించడం లేదా శరీరంలో ఎక్కడైనా గడ్డలు తగలడం వంటివి జరిగితే ఆలస్యం చేయకూడదు.

మీరు గూగుల్ చేసేటప్పుడు కేవలం విశ్వసనీయమైన మెడికల్ వెబ్‌సైట్లనే చూడండి. ఏదైనా చదివినప్పుడు భయపడకుండా అది ఒక సమాచారం మాత్రమే అని గుర్తించండి. అనారోగ్యం అనిపించినప్పుడు ఇంటర్నెట్ కంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చే సలహానే ఫైనల్ అని గుర్తుంచుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button