Just Andhra PradeshJust PoliticalLatest News

Pawan Kalyan:పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ..మంగళగిరి సభలో సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: వైసీపీ నాయకులు తమ బెదిరింపు ధోరణిని మానుకోవాలని, లేదంటే పర్మినెంట్ గా వారు అధికారంలోకి రాకుండా ఏం చేయాలో తనకు బాగా తెలుసని పవన్ హెచ్చరించారు

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)మంగళగిరి వేదికగా వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీ తరపున పదవులు పొందిన నాయకులతో నిర్వహించిన ‘పదవి-బాధ్యత’ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు తమ బెదిరింపు ధోరణిని మానుకోవాలని, లేదంటే పర్మినెంట్ గా వారు అధికారంలోకి రాకుండా ఏం చేయాలో తనకు బాగా తెలుసని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో రౌడీయిజానికి తావులేదని, మహిళలను అవమానించే వారిని, గంజాయి బ్యాచ్‌లను వెనకేసుకొచ్చే వారిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని పవన్ కల్యాణ్ తెగేసి చెప్పారు. ఈ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

తనకు ఎవరూ వ్యక్తిగత శత్రువులు లేరని, కేవలం వారి విధివిధానాలతోనే తనకు సమస్య అని పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పష్టం చేశారు. ఎవరైనా ప్రజల సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని, కానీ రౌడీలను ప్రోత్సహిస్తూ సామాన్యులను భయపెట్టాలని చూస్తే ఊరుకోనని హెచ్చరించారు. “తప్పదనుకుంటే ఆఖరి అస్త్రంగా షర్ట్ మడతపెడతాం” అని పవన్ వార్నింగ్ ఇచ్చారు

ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పనులు ఎవరూ చేయకూడదని, అధికారులు ,ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఏపీ మరియు దేశ సమగ్రతకు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అని పవన్ కల్యాణ్ భావోద్వేగంగా మాట్లాడారు.

Pawan Kalyan
Pawan Kalyan

ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరో కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఆయన కోరారు. ఇది తన వ్యక్తిగత ప్రతిపాదన అని, దీనిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు.

అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ, పోలీసులను , కాంట్రాక్టర్లను బెదిరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, అరాచక శక్తులకు పర్మినెంట్ గా చెక్ పెడతామని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

కొత్తగా కార్పొరేషన్ల ఛైర్మన్లు . డైరెక్టర్లుగా పదవులు పొందిన వారికి పవన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచినందుకే మీకు ఈ గుర్తింపు వచ్చిందని, పదవి చిన్నదైనా పెద్దదైనా దానిని బాధ్యతగా నిర్వహించాలని సూచించారు. దాదాపు 4 వేల మందికి పైగా పదవులు వచ్చాయని, వీరంతా ప్రజా సేవలో చురుగ్గా పాల్గొనాలని కోరారు.

ప్రాంతీయతత్వం లేదా కులాల ఆధారంగా పార్టీలు ఎప్పటికీ నిలబడవని, కేవలం సిద్ధాంతాలు మరియు నిబద్ధత ఉంటేనే ప్రజల గుండెల్లో నిలుస్తామని పవన్ చెప్పారు. సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది యువతను ఉదాహరణగా చూపిస్తూ, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడే పని చేయాలని హితవు పలికారు.

రాజ్యాంగబద్ధంగానే ఉంటానని చెబుతూనే, అన్యాయం జరిగినప్పుడు గొడవకు వెళ్లడానికి లైఫ్ లాంగ్ సిద్ధమని ప్రకటించడం ఆయన తెగువకు నిదర్శనమని జనసైనికులు ఉప్పొంగిపోతున్నారు. మొత్తంగా వైసీపీ నాయకులు ఇప్పటికైనా తమ పార్లమెంటరీ భాషను మార్చుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని ఆయన హెచ్చరించారు. అరాచక శక్తులకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఈ తెగువ , బాధ్యతాయుతమైన నాయకత్వం సామాన్య ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button