Just TelanganaJust NationalLatest News

Child Trafficking : వామ్మో..చిన్నారుల అక్రమ రవాణాలో తెలంగాణ టాప్ అట..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

Child Trafficking: ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి, అలాగే సరిహద్దు రాష్ట్రాల నుంచి మెట్రో నగరాలకు ఈ రవాణా సాగుతోంది.

Child Trafficking

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న చైల్డ్ ట్రాఫికింగ్ (పిల్లల అక్రమ రవాణా-Child Trafficking ) కేసుల్లో తెలంగాణ పేరు మొదటి వరుసలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రధాన ముఠాలను ఛేదించి, 90 మంది నిందితులను అరెస్టు చేశారంటే ఈ దందా ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌లోని చైతన్యపురి, మియాపూర్, మేడిపల్లి నుంచి మొదలుకొని కరీంనగర్, సూర్యాపేట వంటి జిల్లాల వరకు ఈ (Child Trafficking)ముఠాల నెట్‌వర్క్ విస్తరించింది. కేవలం తెలంగాణలోనే కాకుండా గుజరాత్, ముంబై వంటి ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన కేసుల్లో కూడా తెలంగాణ మూలాలు ఉండటం పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదికల ప్రకారం, దేశంలో ప్రతీయేటా వేల సంఖ్యలో చిన్నారులు అక్రమ రవాణాకు గురవుతున్నారు. ఒక లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా నమోదవుతున్న చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి, అలాగే సరిహద్దు రాష్ట్రాల నుంచి మెట్రో నగరాలకు ఈ రవాణా సాగుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులను టార్గెట్ చేసి, కొద్దిపాటి డబ్బు ఆశ చూపి పసిగుడ్డులను కొనుగోలు చేయడం, ఆ తర్వాత వారిని సంతానం లేని దంపతులకు లక్షలాది రూపాయలకు విక్రయించడం ఈ ముఠాల ప్రధాన పని.

Child Trafficking
Child Trafficking

దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం ఈ అక్రమ రవాణాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ఐవీఎఫ్ (IVF) సెంటర్ల పాత్ర కూడా ఉంటోంది. సంతానం కోసం వచ్చే దంపతుల వివరాలు సేకరించి, వారికి శిశువులను ఇప్పిస్తామని నమ్మించి బ్రోకర్లు రంగంలోకి దిగుతున్నారు. నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించడం, ఆసుపత్రి రికార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు మార్చడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు.

పుట్టిన పసికందులను బస్సుల్లో పార్శిల్స్ లాగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలించడం చూస్తుంటే వీరి క్రూరత్వం అర్థమవుతుంది. సృష్టి కేసులో 27 మందిని, మియాపూర్ కేసులో 11 మందిని అరెస్టు చేయడం ద్వారా ఈ దందా వెనుక ఉన్న కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను పోలీసులు బయటపెట్టారు.

అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ఐవీఎఫ్ సెంటర్లు, ప్రసవాలు జరిగే నర్సింగ్ హోమ్‌ల డేటాబేస్ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ప్రసవం జరిగిన వెంటనే ఆ శిశువు వివరాలు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదయ్యేలా ప్రభుత్వం కఠిన నిబంధనలు తేవాలి.

పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలను అమ్ముకోకుండా, ప్రభుత్వం నుంచి వారికి భరోసా కల్పించాలి. పిల్లల అమ్మకం, కొనుగోలు అనేది ఉరిశిక్ష పడేంతటి నేరమని గ్రామాల్లో అవగాహన కల్పించాలి.

చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియగా ఉంది. దీనివల్ల చాలా మంది దంపతులు షార్ట్ కట్ కోసం బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేస్తే అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయొచ్చు.

కేవలం అరెస్టులతో సరిపెట్టకుండా, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. ఈ ముఠాలో భాగమైన డాక్టర్లు, నర్సుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలి.

పసిపిల్లల భవిష్యత్తును చిదిమేస్తున్న ఈ చైల్డ్ ట్రాఫికింగ్ (Child Trafficking)మహమ్మారిని అరికట్టడానికి పోలీసులు ఎంత పోరాడుతున్నా, సమాజంగా మన బాధ్యత కూడా ఉంది. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 1098 లేదా 100 కి సమాచారం ఇవ్వడం ద్వారా ఒక చిన్న ప్రాణాన్ని కాపాడొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ టీమ్స్ ని రంగంలోకి దింపింది. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ చీకటి సామ్రాజ్యాన్ని కూల్చేందుకు సిద్ధమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button