Speed: మీ ఫోన్ స్లో అయిందా? ఈ 3 సెట్టింగ్స్ మారిస్తే కొత్త ఫోన్ లాగా పరుగెడుతుంది..
Speed: నిజానికి ఫోన్ హార్డ్‌వేర్ బాగున్నా, లోపల ఉండే కొన్ని సాఫ్ట్‌వేర్ సెట్టింగ్స్ వల్ల ఫోన్ స్లో అవుతుందట.
Speed
మనం ఫోన్ కొన్నప్పుడు కొత్తలో అది రాకెట్లా దూసుకుపోతుంది. కానీ ఏడాదో, రెండేళ్లో గడిచేసరికి అదే ఫోన్ స్లో అయిపోతుంది. ఏదైనా యాప్ ఓపెన్ చేయాలన్నా, వాట్సాప్‌లో మెసేజ్ పంపాలన్నా హ్యాంగ్ అయిపోతూ మన సహనానికి టెస్ట్ పెడుతుంది. దీంతో వెంటనే చాలామంది ఫోన్ పాడైపోయింది, కొత్తది కొనాలి” అని ఫిక్స్ అయిపోతారు. కానీ, నిజానికి ఫోన్ హార్డ్‌వేర్ బాగున్నా, లోపల ఉండే కొన్ని సాఫ్ట్‌వేర్ సెట్టింగ్స్ వల్ల ఫోన్ స్లో అవుతుందట. మీ పాత ఫోన్‌ను మళ్లీ కొత్తదానిలా మార్చడానికి, మీరు వెంటనే మార్చుకోవాల్సిన ఆ 3 మ్యాజికల్ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
యానిమేషన్ స్కేల్ తగ్గించడం (Developer Options)..ఫోన్ స్లోగా అనిపించడానికి ప్రధాన కారణం అందులో ఉండే ‘యానిమేషన్స్’అట. మీరు ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు అది మెల్లగా విచ్చుకున్నట్లు రావడం చూడటానికి బాగుంటుంది కానీ, అది ప్రాసెసర్‌పై చాలా భారాన్ని పెంచుతుందట.
దీనికోసం మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘About Phone’ పైన క్లిక్ చేయండి. అక్కడ ఉండే ‘Build Number’ మీద వరుసగా 7 సార్లు ట్యాప్ చేస్తే ‘Developer Options’ ఎనేబుల్ అవుతాయి.
ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి.. Window Animation Scale, Transition Animation Scale, Animator Duration Scale అనే మూడు ఆప్షన్లను వెతకాలి. ఇవి సాధారణంగా 1x లో ఉంటాయి, వాటిని 0.5x కి మార్చండి లేదా పూర్తిగా ‘Off’ చేయాలి. ఇలా చేయగానే మీ ఫోన్ రెస్పాన్స్ టైమ్ విపరీతంగా పెరుగుతుంది.
బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ సెట్ చేయడం..మనకు తెలియకుండానే ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో పదుల సంఖ్యలో యాప్స్ రన్ అవుతుంటాయి. ఇవి రామ్ (RAM)ను వాడేయడమే కాకుండా బ్యాటరీని కూడా ఖాళీ చేస్తాయి. దీనివల్ల మనం వాడుతున్న యాప్ స్లో అయిపోతుంది.

దీనికోసం ఏం చేయాలంటే.. ఇది కూడా ‘Developer Options’ లోనే ఉంటుంది. కిందకు స్క్రోల్ చేస్తే ‘Background process limit’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది సాధారణంగా ‘Standard limit’ లో ఉంటుంది. దీన్ని ‘At most 2 processes’ లేదా ‘No background processes’ గా మార్చాలి. దీనివల్ల మీరు వాడుతున్న యాప్‌కు పూర్తి రామ్ పవర్ అందుతుంది, ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు.
క్యాచీ డేటా , అన్ యూజ్డ్ యాప్స్ క్లీన్ చేయడం..మనం వాడే ప్రతి యాప్ కొంత ‘క్యాచీ డేటా’ (Cache Data)ను స్టోర్ చేసుకుంటుంది. రోజులు గడిచేకొద్దీ ఇది జీబీల్లోకి చేరి ఫోన్ మెమరీని నింపేస్తుంది. మెమరీ ఫుల్ అయితే ఫోన్ కచ్చితంగా స్లో అవుతుంది.
ఏం చేయాలి సెట్టింగ్స్‌లో స్టోరేజ్ (Storage) లోకి వెళ్లి అనవసరమైన క్యాచీ ఫైల్స్‌ను డిలీట్ చేయండి. అలాగే మీరు మూడు నెలలుగా వాడని యాప్స్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ప్రతి యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొంత డేటాను తీసుకుంటుంది కాబట్టి, తక్కువ యాప్స్ ఉంటే ఫోన్ అంత వేగం(Speed)గా పనిచేస్తుంది. వీలైతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి భారీ యాప్స్ కు బదులుగా వాటి ‘Lite’ వెర్షన్లను వాడటం మంచిది.
చాలామంది ‘ర్యామ్ క్లీనర్’ లేదా ‘బ్యాటరీ సేవర్’ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. నిజానికి ఇవే ఫోన్‌ను ఇంకా స్లో చేస్తాయన్న విషయం వారికి తెలీదు. పైన చెప్పిన మూడు సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు, మీరు ఏ యాప్ సాయం లేకుండానే మీ పాత ఫోన్ స్పీడు(Speed)ను పెంచుకోవచ్చు. అలాగే మీ ఫోన్ స్టోరేజ్ ఎప్పుడూ 20 శాతం ఖాళీగా ఉండేలా చూసుకోండి, అప్పుడు ఫోన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.



