Just National

Army: ఆర్మీ జవాన్లకు ఇక ఇన్ స్టా.. ఈ కండీషన్లు ఫాలో అవ్వాల్సిందే

Army: ఇప్పటి వరకూ ఇన్ స్టా, ఫేస్ బుల్ వంటి వాటిని ఉపయోగించే విషయంలో కఠిన ఆంక్షలు ఉండేవి.

Army

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఎంత డామినేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ చిన్న విషయమైనా, పెద్ద వార్త అయినా క్షణాల్లో ప్రపంచానికి తెలిసే ఏకైక మార్గం సోషల్ మీడియానే. ఆయా వార్తల్లో నిజాలు, తప్పుడు ప్రచారం పక్కన పెడితే ఇన్ స్టా, ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి వాటిని ఉపయోగించని వారుండరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారి సంఖ్య 5.6 బిలియన్లుగా ఉంది.

అంటే ప్రపంచ జనాభాలో 67 శాతానికి పైగా సోషల్ మీడియా అకౌంట్లను వాడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సోషల్ మీడియా అకౌంట్లకు సైనికులు దూరంగా ఉండాల్సిందే. ఈ క్రమంలో భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇప్పటి వరకూ ఇన్ స్టా, ఫేస్ బుల్ వంటి వాటిని ఉపయోగించే విషయంలో కఠిన ఆంక్షలు ఉండేవి. ప్రస్తుతం వాటిని సడలించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సడలింపుల ప్రకారం ఆర్మీ సిబ్బంది(Army), అధికారులు ఇకపై ఇన్ స్టా గ్రామ్ వాడొచ్చు. కానీ కొన్ని కఠినమైన షరతులు పాటిస్తేనే ఉపయోగించుకోగలుగుతారు. అవి అత్యంత కఠినమైన భద్రతా షరతులుగా పేర్కొంది.

కొత్తగా చేసిన సడలింపులు, భద్రతా షరతులతో కూడిన మార్గదర్శకాలను అన్ని ఆర్మీ (Army)హెడ్ క్వార్టర్స్ కు పంపించింది. దీనిలో ముఖ్యమైన రూల్ ఏంటంటే సైనికులు ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.. ఇన్‌స్టాలో ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్ చేయడం నిషిధ్ధం. అలాగే వేరే వారి పోస్టులకు కామెంట్లు పెట్టడం.

Army
Army

రీల్స్‌ను షేర్ చేయడం, మెసేజ్‌లకు స్పందించకూడదు. వీటిపైనే రక్షణ శాఖ కఠినమైన ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే మన ఆర్మీ సిబ్బంది(Army),అధికారులు కేవలం మూగ ప్రేక్షకులలాగానే ఉండిపోవాలి. ఆ సడలింపులు ఇవ్వడానికి కూడా కారణాలున్నాయి. ప్రస్తుతం డిజిటల్ వరల్డ్ లో నకిలీ పోస్టులు, తప్పుదోవ పట్టించే వార్తలు, తప్పుడు ప్రచారాలు వంటివి దేశ భద్రతకు ముప్పుగా మారతాయని ఆర్మీ(Army) భావిస్తోంది.

తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో అనుమానాస్పద పోస్టులు , తప్పుడుసమాచారాన్ని గుర్తిస్తే.. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెబుతున్నారు. సైనికులు వ్యక్తిగత డిజిటల్ అవసరాలు, దేశ భద్రత మధ్య సమతుల్యత పాటించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button