Battle of Galwan: చైనాను వణికిస్తున్న బాలీవుడ్ మూవీ.. అసలు దీని స్టోరీ ఏంటి ?
Battle of Galwan: సరిహద్దులోని గల్వాన్ వ్యాలీ భారత భూభాగంపై ఎప్పటినుంచో చైనా మిలటరీ కన్నేసింది. దీనిని ఆక్రమించుకునే ప్రయత్నంలో హద్దుమీరి ప్రవర్తించింది.
Battle of Galwan
చైనా లాంటి అగ్రదేశానికి ఒక బాలీవుడ్ సినిమా వణుకు పుట్టిస్తోంది. తాము దాచిన కొన్ని వాస్తవాలను ఆ మూవీలో చూపిస్తున్నారన్న విషయం డ్రాగన్ కంట్రీకి నిద్ర లేకుండా చేస్తోంది. ఈ మూవీ పేరు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్(Battle of Galwan)….భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న గల్వాన్ లోయలో ఘటనలపైనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ (Battle of Galwan)మూవీకి సంబంధించిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అదే సమయంలో చైనా మీడియా మాత్రం అక్కసు వెళ్లగక్కింది. గతంలో ఎన్నడూలేని విధంగా భారత సినిమాపై విషం చిమ్ముతోంది. గల్వాన్ ఘర్షణ సమయంలో అసలు నిజాలను ఈ మూవీ బయటపెట్టబోతోంది. అంతా వక్రీకరించి చూపిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తోంది.
సరిహద్దులోని గల్వాన్ వ్యాలీ భారత భూభాగంపై ఎప్పటినుంచో చైనా మిలటరీ కన్నేసింది. దీనిని ఆక్రమించుకునే ప్రయత్నంలో హద్దుమీరి ప్రవర్తించింది. ఈ పరిణామాలను భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. దాదాపు 40మంది చైనా సైనికులను మట్టుబెట్టారు.. మిగిలిన వారిని తరిమి తరిమి కొట్టారు. ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ అక్కడికే వెళ్లే వరకూ విడిచిపెట్టలేదు.
ఈ క్రమంలో మన వీరులు కూడా 20 మంది అమరులయ్యారు. భారత సైనికులు చైనీయులను ఎలా తరిమి కొట్టారో చెబుతూ రష్యన్ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. అమెరికా నిఘా సంస్థలు కూడా నాటి ఘర్షణల్లో భారత జవాన్ల పోరాటంపై ప్రశంసలు కురిపించాయి. అయితే చైనా మాత్రం ఆనాటి ఘటనలో కేవలం నలుగురు మాత్రమే మరణించినట్టు అబద్దాలు అల్లేసింది.

సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్‌లో అక్కసు వెళ్లగక్కింది. అప్పట్లో ఈ వివాద సమయంలో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు. మూవీ కథ భారత్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి కారణమవుతుందని చైనా మీడియా నానా హంగామా చేస్తోంది.
అదే సమయంలో సీపీసీ 20వ సమావేశాలు జరిగినప్పుడు జాతీయసభ వేదికపై జిన్‌పింగ్ పదేళ్ల విజయాలను గుర్తు చేస్తూ ప్రదర్శించారు. అందులో గల్వాన్ ఘర్షణను చైనా పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకుని జిన్‌పింగ్ ఘనతగా ప్రదర్శించారు. ఓవరాల్ గా తమ సైనికుల మరణాలు, ఓటమిని దాచిపెట్టిన డ్రాగన్ కంట్రీ రహస్యాలు ఈ మూవీలో చూడొచ్చని చెబుతున్నారు.



