Just LifestyleLatest News

Healthy Sweet: న్యూ ఇయర్ స్పెషల్ హెల్తీ స్వీట్..బలానికి బలం, రుచికి రుచి

Healthy Sweet: పంచదార అస్సలు వాడం కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు కూడా డ్రై ఫ్రూట్ స్వీటును నిశ్చింతగా తినొచ్చు.

Healthy Sweet

కొత్త ఏడాది అనగానే ఇంట్లో తినడానికో, లేక చుట్టాలకు,స్నేహితులకు ఇవ్వడానికో అందరం కేకులు, స్వీట్స్ కొంటుంటాం. కానీ ఈసారి బయట కొనే వాటి కంటే ఇంట్లోనే ఎంతో ఆరోగ్యకరంగా(Healthy Sweet), టేస్టీగా ఉండే ‘డ్రై ఫ్రూట్ హల్వా’ను ప్రయత్నించి చూడండి. దీనిలో పంచదార అస్సలు వాడం కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు కూడా నిశ్చింతగా తినొచ్చు.

దీని తయారీ(Healthy Sweet)కి కావలసిన పదార్థాలు.. ఒక కప్పు ఖర్జూరాలు (గింజలు తీసినవి), అర కప్పు బాదం, అర కప్పు జీడిపప్పు, పావు కప్పు పిస్తా, రెండు చెంచాల గసగసాలు, కొద్దిగా యాలకుల పొడి , తగినంత నెయ్యి.

ముందుగా ఖర్జూరాలను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత బాదం, జీడిపప్పు, పిస్తాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకుని అందులో రెండు చెంచాల నెయ్యి వేసి, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

Healthy Sweet
Healthy Sweet

అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్ వేసి తక్కువ మంట మీద వేయించాలి. ఖర్జూరం మెత్తబడి దగ్గరకు వస్తున్నప్పుడు, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, గసగసాలు(లేకపోయినా పర్వాలేదు) యాలకుల పొడి కలిపి బాగా కలపాలి.

మిశ్రమం అంతా కడాయికి అంటుకోకుండా ముద్దలా వచ్చినప్పుడు, ఒక నెయ్యి రాసిన ప్లేట్ లోకి దీనిని తీసుకుని సమానంగా పరచాలి. అది చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవడమే.

ఈ హల్వా కేవలం రుచిగానే కాకుండా శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. కొత్త ఏడాదిని ఇలాంటి ఒక హెల్తీ స్వీట్ తో ప్రారంభించడం నిజంగా ఒక మంచి నిర్ణయం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button