Vande Bharat Sleeper:వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఆరోజు మోదీ చేతుల మీదుగా పచ్చజెండా
Vande Bharat Sleeper: ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు, శబ్దం రాకుండా ఉండేందుకు వ్యాక్యూమ్ టాయిలెట్లు, మెత్తటి బెర్త్‌లు, విమాన తరహా ఇంటీరియర్స్ ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు.
Vande Bharat Sleeper
దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ..వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కడానికి రెడీ అయిపోయింది. ఇప్పటివరకు అంతా కేవలం కూర్చుని ప్రయాణించే (Sleeper Chair Car) వందే భారత్ రైళ్లనే చూశాం.
కానీ ఇప్పుడు విమాన ప్రయాణంలా మంచి అనుభూతితో పాటు , పడుకుని వెళ్లడానికి వీలుగా వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper)వెర్షన్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది. జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా మాల్దా నిత్యానందరూర్‌లో జరిగే బహిరంగ సభలో ఈ తొలి రైలును ప్రారంభించబోతున్నారు.
తొలి వందే భారత్ స్లీపర్ రైలు(Vande Bharat Sleeper)గువహతి – హౌరా మధ్య నడుస్తుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు అయితే ట్రాక్ సామర్థ్యాన్ని బట్టి 130 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. ఇందులో మొత్తం 823 మంది ప్రయాణించడానికి వీలుగాసీటింగ్, బెర్త్ సామర్థ్యం ఉంది. ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు, శబ్దం రాకుండా ఉండేందుకు వ్యాక్యూమ్ టాయిలెట్లు, మెత్తటి బెర్త్‌లు, విమాన తరహా ఇంటీరియర్స్ ఈ రైలు ప్రత్యేకతలు.

సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఈ ఛార్జీలను నిర్ణయించినట్లు తెలుస్తోందది. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ , ఫస్ట్ ఏసీ క్లాసులను బట్టి రూ.2,300 నుంచి రూ.3,600 మధ్య టికెట్ ధరలు ఉండొచ్చు. ఈ రైలులో ప్రయాణించే వారికి ఉచితంగా ఆ ప్రాంతీయ వంటకాలను (అస్సామీ, బెంగాలీ) వడ్డించనున్నారు. అయితే అతి త్వరలోనే సికింద్రాబాద్ – ఢిల్లీ మధ్య కూడా ఇలాంటి స్లీపర్ రైలు రాబోతుండటం తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు.
Plastic Containers: ప్లాస్టిక్ డబ్బాల జిడ్డు,వాసనతో విసిగిపోయారా? ఈ సింపుల్ ట్రిక్ వాడండి




2 Comments