Just EntertainmentJust Andhra PradeshLatest News

The Rajasaab : ప్రభాస్ ‘రాజాసాబ్’జాతర.. 3 ఏళ్ల కష్టం.. 40 నిమిషాల క్లైమాక్స్..

The Rajasaab : ప్రభాస్ 'ది రాజా సాబ్' క్లైమాక్స్ - మారుతి మ్యాక్స్ అంటూ తమన్ రియాక్షన్... ఫ్యాన్స్‌కు పండుగే

The Rajasaab

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న ‘ది రాజాసాబ్’ (The Rajasaab) చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ హారర్-కామెడీ ఫాంటసీ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ అవబోతోంది

ఈ సందర్భంగా అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు ఊరటనిస్తూ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు , ప్రత్యేక షోలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఈరోజు అంటే జనవరి 8 సాయంత్రం 6 గంటల నుంచే ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. ఈ స్పెషల్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు.

ఇక జనవరి 9 నుంచి మొదటి పది రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని, టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 200 రూపాయల వరకు అదనంగా పెంచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర సుమారు 297 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 377 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది.

ఈ సినిమా కేవలం ఒక గ్లామర్ మూవీ మాత్రమే కాదు. దీని వెనుక మూవీ యూనిట్ మూడేళ్ల కఠిన శ్రమ దాగి ఉంది. 2022 సెప్టెంబర్‌లోనే ఈ షూటింగ్ సైలెంట్‌గా మొదలైంది. నిజానికి ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌ను చాలా తక్కువ సమయంలో పూర్తి చేయాలని భావించినా కూడా..కథలోని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ , గ్రాఫిక్స్ కోసం దర్శకుడు మారుతి ఏకంగా మూడేళ్లు టైమ్ తీసుకున్నారు.

The Rajasaab
The Rajasaab

మొత్తం 280 రోజుల పాటు సాగిన ఈ షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాలకే సుమారు 140 రోజులు కేటాయించడం విశేషం. ది రాజాసాబ్ (The Rajasaab) మూవీలో అత్యంత కీలకమైన భాగం క్లైమాక్స్. దాదాపు 40 నిమిషాల పాటు సాగే ఈ విజువల్ వండర్ క్లైమాక్స్ కోసం 120 రోజుల షూటింగ్, మరో 300 రోజుల వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్స్ జరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ సెట్‌ను హైదరాబాద్‌లో నిర్మించడం సినిమా రేంజ్‌ను తెలియజేస్తోంది.

సినిమా నిడివి కూడా ఆడిషన్స్ ఓపికకు పరీక్ష కాకుండా, మూడు గంటల 9 నిమిషాల పాటు ఆసక్తికరంగా సాగేలా ఎడిటింగ్ చేశారు. ఇందులో వింటేజ్ ప్రభాస్‌ను, ఆయన పాత కామెడీ టైమింగ్‌ను మళ్లీ చూడబోతున్నామని మూవీ టీం ధీమాగా చెబుతోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.

తమన్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా రెబల్ సాబ్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. హారర్ కామెడీ జానర్‌లో ఇంత భారీ బడ్జెట్‌తో (సుమారు 400 కోట్లు) సినిమా రావడం టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ టైమ్. విజువల్స్ పరంగా హాలీవుడ్ స్థాయిని అందుకోవాలని డైరక్టర్ మారుతి పడిన తపన రేపు థియేటర్లలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Sankranthi travelers:సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో 8 ప్రత్యేక రైళ్లు.. ఫుల్ షెడ్యూల్ ఇదే

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button