Just LifestyleJust SpiritualLatest News

Mirror : బెడ్ రూమ్‌లో అద్దం ఉండకూడదా?

Mirror : వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రించే గదిలో.. అద్దం విషయంలో కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయంటున్నారు నిపుణులు

Mirror

ఇప్పుడు చాలామంది బెడ్ రూమ్ అలంకరణలో అద్దం (Mirror) ఒక ముఖ్యమైన భాగంగా అనుకుంటున్నారు . కానీ వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రించే గదిలో.. అద్దం విషయంలో కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అద్దం అనేది శక్తులను ప్రతిబింబించే గుణాన్ని కలిగి ఉంటుందని అందుకే దానిని తప్పుడు స్థానంలో ఉంచితే అది నిద్రను , ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అంటున్నారు.

ప్రధానమైన వాస్తు నియమం ఏమిటంటే.. మనం మంచం మీద నిద్రపోతున్నప్పుడు మన ప్రతిబింబం అద్దంలో కనిపించకూడదట. ముఖ్యంగా మంచానికి ఎదురుగా ఉండకూడదట. ఇలా జరిగితే మన శరీరంలోని శక్తిని అద్దం పీల్చుకుంటుందని అలాగే వ్యతిరేక శక్తులను మనపైకి మళ్లిస్తుందని నమ్మకం. దీనివల్ల పీడకలలు రావడం, నిద్రలో ఉలిక్కిపడటం, ఉదయం లేవగానే అలసటగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడానికి కూడా ఇది ఒక కారణం కావొచ్చని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Mirror
Mirror

ఒకవేళ మీ బెడ్ రూమ్‌లో ఇప్పటికే అద్దం ఉండి, దానిని మార్చడానికి వీలు కాకపోతే, రాత్రి పడుకునే ముందు దానిపై ఒక పల్చని బట్ట లేదా కర్టెన్ కప్పడం ఉత్తమమైన పరిష్కారమని అంటున్నారు. అలాగే అద్దాలను ఎప్పుడూ ఉత్తర లేదా తూర్పు దిశ గోడలకు మాత్రమే అమర్చాలి.

అంతేకాదు పగిలిన లేదా మసకబారిన అద్దాలను ఇంట్లో అస్సలు ఉంచకూడదు. అద్దం ఎప్పుడూ శుభ్రంగా ఉంటేనే అది సానుకూల శక్తిని ఇస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రశాంతమైన నిద్ర , ఆరోగ్యకరమైన జీవితం కోసం బెడ్ రూమ్ లో ఈ చిన్న చిన్న వాస్తు మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం.

Konaseema:సంక్రాంతికి అసలైన అందం కోనసీమే..పచ్చని ప్రక‌ృతి మధ్య పండుగ సంబరాలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button