Changur Baba :ఎవరీ చంగూర్ బాబా .. కులాన్ని బట్టి రేటు, విదేశీ ఫండింగ్ ఏంటీ కథ..
Changur Baba: యూపీలోని గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ చిన్న చిన్న రంగురాళ్లు, తావీజ్‌లు, ఉంగరాలు అమ్ముకుని తిరిగేవాడు.
Changur Baba
ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేల్లీ,షా బాద్, బలరాంపూర్ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా చంగూర్ బాబా (Changur Baba) పేరే వినిపిస్తోంది. చంగూర్ బాబా అలియాస్ జలాలుద్దీన్ షా.. ఒకప్పుడు సైకిల్‌పై తిరుగుతూ రంగురాళ్లు, ఉంగరాలు అమ్ముకునే ఒక ఫకీర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు 500 కోట్ల అక్రమ సామ్రాజ్యానికి అధిపతిగా ఎలా మారాడనే ప్రశ్నలే వినిపిస్తున్నాయి.
ఒక్కరూ ఇద్దరూ కాదు ఏకంగా 4,000 మందికి పైగా హిందూ యువతను ఎలా మతం మార్చగలిగాడనే అనుమానం తలెత్తుతుంది. ఈ కేసులో యూపీ ఏటీఎస్ (ATS) , ఈడీ (ED) జరుపుతున్న దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
చంగూర్ బాబా(Changur Baba) అసలు పేరు జలాలుద్దీన్ షా. సుమారు 50-55 ఏళ్ల వయస్సున్న ఈయనది అతి సామాన్యమైన ముస్లిం కుటుంబం. 1990 నుంచి 2000 వరకూ ఇతను యూపీలోని గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ చిన్న చిన్న రంగురాళ్లు, తావీజ్‌లు, ఉంగరాలు అమ్ముకుని తిరిగేవాడు.

నెమ్మదిగా రంగురాళ్ల అమ్మకాలను పక్కన పెట్టేసి, తాను ఒక పీరుబాబాను అంటూ ప్రచారం చేసుకున్నాడు. మీ కష్టాలు తీరుస్తాను, గ్రహ దోషాలను తొలగిస్తానంటూ అమాయక ప్రజలను నమ్మించడం మొదలుపెట్టాడు.
రంగురాళ్లు అమ్మేవాడు కాబట్టి అందరూ అతడిని చంగూర్ బాబా అని పిలవడం అలవాటు చేసుకున్నారు. ఈ సమయంలోనే విదేశీ శక్తులతో సంబంధాలు ఏర్పరచుకుని మతమార్పిడి అనే భారీ దందాకు తెరలేపాడు.
ఆ తర్వాత 2015 నుంచి 2024 మధ్య కాలంలో ఇతని ఎదుగుదల రాకెట్ వేగంతో సాగింది. ఒకప్పుడు సైకిల్ మీద ఊరూరూ తిరిగిన వ్యక్తి.. ఇప్పుడు లగ్జరీ కార్లు, 70 గదుల భారీ విల్లా, కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న అసామాన్యుడిగా ఎదిగాడు.
ఈ కేసులో అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, మతం మార్చుకున్న వారికిచ్చే డబ్బు విషయంలో ఒక పక్కా రేటు కార్డు ఉండటం.
1. బ్రాహ్మణ , క్షత్రియ వర్గాలకు చెందిన వారు మతం మారితే దాదాపు 15 నుంచి 16 లక్షల రూపాయలు చెల్లించేవారు.
2. వెనుకబడిన తరగతుల (BC/OBC) వారికి 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఇచ్చేవారు.
3. దళిత చ గిరిజన వర్గాలకు చెందిన వారికి 8 నుంచి 10 లక్షల రూపాయల వరకు ముట్టజెప్పేవారు.
కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాకుండా, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అనారోగ్యంతో బాధపడేవారికి ఉచితంగా పెద్ద ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేయిస్తామని నమ్మబలికేవారు. ఇలా ఆశ చూపడమే కాకుండా, వారిని మానసికంగా బానిసలుగా మార్చుకునేవారు.
చంగూర్ బాబా (Changur Baba) మతమార్పిడులెపుడూ నేరుగా జరిగేవి కావు. దీనికి ఒక పద్ధతి ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలను, వితంతువులను లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతను మొదట టార్గెట్ చేసేవారు. బాబా భార్య నీతూ అలియాస్ నస్రీన్ మహిళలను ఆకర్షించడంలో చాలా ఎక్కువ పాత్ర పోషించేది.
తమ టార్గెట్ చేసిన వారిని మొదట బాబా దగ్గరకు తీసుకువచ్చి దీదార్ అనే ప్రక్రియ ద్వారా వారిని, వారి మానసిక స్థితిని మార్చేవారు. హిందూ మతంలో కుల వివక్ష ఉంది, ఇస్లాంలో చేరితే అందరూ సమానంగా ఉంటారంటూ బ్రెయిన్ వాష్ చేసేవారు. వారు పూర్తిగా బాబా ఆధీనంలోకి వచ్చాక, భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి మతమార్పిడి పత్రాలపై సంతకాలు కూడా చేయించుకునేవారు.
ఈడీ (ED) జరిపిన సోదాల్లో చంగూర్ బాబాకు ఉన్న 48 కి పైగా బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. మూడు, నాలుగేళ్లలోనే ఈ ఖాతాల్లోకి విదేశాల నుంచి సుమారు 500 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఆధారాలు లభించాయి.
ముఖ్యంగా సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీ , పాకిస్తాన్ వంటి దేశాల నుంచి ఎన్జీఓల ముసుగులో ఈ నిధులు అందేవి. ఈ సొమ్మును మతమార్పిడులకు, ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించేవారు. బలరాంపూర్‌లో బాబా నిర్మించిన 70 గదుల భారీ విల్లాను చూసి అధికారులే ఆశ్చర్యపోయారంటే బాబా రేంజ్‌ను అర్ధం చేసుకోవచ్చు. అందులో సుమారు 40 గదులను యూపీ ప్రభుత్వం ఇప్పటికే బుల్డోజర్లతో కూల్చేసింది.

ఈ కేసు కేవలం యూపీకి మాత్రమే పరిమితం కాలేదు. నేపాల్ సరిహద్దుల ద్వారా ఈ మనీలాండరింగ్ సాగుతున్నట్లు ఈడీ గుర్తించింది. చంగూర్ బాబాకు ముఖ్య అనుచరుడైన ఇదు ఇస్లాం అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.
ఇతనే బాబాకు లీగల్ సలహాలు ఇవ్వడం, విదేశీ నిధులను మళ్లించడంలో కీలక పాత్ర పోషించేవాడని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఏటీఎస్ 400 మందికి పైగా సాక్షులను విచారించింది. ఫిబ్రవరి 2026లో ఈ కేసులో కీలకమైన చార్జ్‌షీట్ దాఖలు కాబోతోంది.
ప్రస్తుతం జలాలుద్దీన్ షా అలియాస్ చంగూర్ బాబా.. పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆయనపై మతమార్పిడి నిరోధక చట్టం ,మనీలాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు బయటపడినప్పటి నుంచి యూపీలో పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది.
హిందూ సంఘాలు దీనిని దేశ భద్రతకు అతి పెద్ద ముప్పుగా భావిస్తున్నాయి. పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విదేశీ నిధులతో ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే సమాజంలో ఆధ్యాత్మికత పేరుతో కొందరు వ్యక్తులు చేసే ఇలాంటి మోసాలను కనిపెట్టడం చాలా అవసరం. చంగూర్ బాబా (Changur Baba)కేసు అనేది కేవలం మతమార్పిడికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఒక భారీ ఆర్థిక నేరం మరియు దేశ వ్యతిరేక కుట్ర. ప్రభుత్వం కూడా ఇలాంటి నెట్‌వర్క్‌లను పూర్తిగా తుడిచిపెట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది.
Gold and Silver:4 గంటల్లోనే 5 వేలు పెరిగిన బంగారం! వెండి ఏకంగా 20 వేల జంప్!**




One Comment